కరోనాబారిన పడకుండా ఉండాలంటే ఎక్కడికెళ్లినా అక్కడి సర్ఫేస్ ను తాకకుండా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు. కానీ అలా తాకకుండా ఉండడం అన్నిచోట్లా సాధ్యం కాదు. మెట్లు ఎక్కేటప్పుడు రెయిలింగ్ ను, డోర్ తీసేటప్పుడు డోర్ హ్యాండిల్ ను.. ఇలా దేన్నో ఒకదానిని తాకకుండా ఉండలేం. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? ఈ ప్రశ్నకు ‘సంస్కార్ ప్రకృతి చికిత్సాలయం’ నేచురోపతి డాక్టర్ శ్రీనివాస్ చెప్తున్న ఆన్సర్ .. మళ్లీ మూలాల్లోకే వెళ్లాలని! వివరాలు ఆయన మాటల్లోనే..
బస్సెక్కితే టాప్ లో ఉండే రాడ్డును పట్టు కోకుండా నిలబడడం కష్టమే. లేదంటే కనీసం సీట్ కు ఉండే ఐరన్ రాడ్డునైనా పట్టు కుంటాం . ఆటో ఎక్కినా, దిగినా ఇలాంటి సపోర్ట్ తప్పదు. ఇక ఏదైనా ఆఫీస్ కు వెళ్లినా, రిలేటివ్స్ దగ్గరికి వెళ్లినా మెట్లు ఎక్కిన చోటల్లా రెయిలింగ్ సపోర్ట్ తీసుకోవాల్సిం దే. ఇలా ఎక్కడికెళ్లినా అక్కడి సర్ఫేస్ ను తాకకుండా ఉండలేం. ఎందుకంటే ఇన్నిరోజులు అలవాటైపోయిం ది. కరోనా సోకుతుందనే భయంతో ఇప్పుడు ఒక్కసారిగా అలవాటు మారాలంటే కష్టమే. సర్ఫేస్ కారణంగానే కరోనా స్ప్రెడ్ అవుతోం దని డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు . అయితే సర్ఫేస్ పై బ్యాక్టీరియా, వైరస్ లేకుండా చూసుకోగలిగితే అవేవీ మన బాడీలోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. అయితే సర్ఫేస్ ను బ్యాక్టీరియా, వైరస్ ఫ్రీగా ఉంచేందుకు గంట గంటకూ శానిటైజ్ చెయ్యలేం కదా? మరెలా? అంటే.. భారతీయ మూలాల్లోకి వెళ్లాలి. యూకేలోని ఇంపీరియల్ కాలేజ్ లో అంటు వ్యాధులపై రీసెర్చి చేస్తు న్న సైంటిస్ట్ గెరాల్డ్ లారోయ్ మామస్ ప్రకారం వరల్డ్‌వైడ్ గా ఏటా కోటిమంది కేవలం బ్యాక్టీరియా, వైరస్‌లతో సోకే వ్యాధులతోనే మరణిస్తున్నారు . ఇవి కేవలం ఆయన చెప్తున్న లెక్కలు మాత్రమే కావు.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు కూడా దాదాపుగా దీనికి దగ్గరగానే ఉన్నా యి. యాం టిబయాటిక్స్, యాం టివైరల్ డ్రగ్స్ ఎన్ని కనిపెట్టినా.. వాటిని కూడా తట్టుకొని నిలబడగలిగే సూక్ష్మజీవులు పుట్టు కొస్తూనే ఉన్నాయి. ఇలాంటి డ్రగ్స్‌కు లొంగని వ్యాధుల వల్లే ఏటా 7 లక్షల మంది చనిపోతున్నారు . ఇప్పటికే తయారు చేసిన మందులు దేనికీ పనికిరానివి అయిపోతున్నాయి. మరి ఈ సూక్ష్మజీవులు ఇంతకు ముందు లేవా? ఉంటే… ఏమాత్రం మెడికల్ ఫెసిలిటీస్ లేని రోజుల్లోనే ప్రజలు ఎలా బతికి బయటపడ్డారు ? ఇవన్నీ కరోనా వ్యాప్తి చెం దుతున్న నేపథ్యంలో చర్చించు కోవాల్సి న అంశాలు.
సహజ వనరులే మందులు..
ఇప్పటిలా టానిక్ లు, ట్యాబ్లెట్లు అప్పుడు లేవు. ఆకు పసర్లు, మూలికలే మందులు. ఇప్పటికీ ఆయుర్వేదంలో వీటిని ఉపయోగిస్తున్నారు . అయితే ఇవన్నీ వ్యాధిబారిన పడ్డ తర్వాత వాడేవి. కానీ.. అసలు వ్యాధి రాకుండా జాగ్రత్త పడడం అనేది ఎప్పటినుం చో ఉంది. ‘ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ’ అనేది మన ఉంది. అందుకే హానికరమైనవేవీ వాడకుండా సహజవనరులనే ఉపయోగించే వాళ్లు. భూమి నుంచి వచ్చిన మట్టితో కుండలు, పాత్రలు చేసి వాడుకు నేవాళ్లు. కాలక్రమంలో కొన్ని ఎలిమెం ట్స్‌ను కనిపెట్టారు . ఇనుము, రాగి,ఇత్తడి, కంచు. వీటివల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని గుర్తిం చి మట్టి పాత్రలకు బదులుగా రాగి, ఇత్తడి పాత్రలు వాడడం మొదలుపెట్టారు.
ఎంతో ముందుచూపుతో..
మన పూర్వీకు లు చాలా ముందుచూపుతో ఉండేవాళ్లు. ఆ విషయం వాళ్లు ప్రతి దాంట్లో నూ నిరూపించుకున్నారు. శారీరకంగా, మానసికంగా, టెక్నికల్ గా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నా రని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపు ల్ రాగి పాత్రలే. ఎక్కు వగా రాగి పాత్రలను వంటింట్లో వాడటం వెనుక ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి అప్పట్లోనే తెలుసుకొని రాగి పాత్రలను ఉపయోగించారు. మనం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంటూ
కాపర్ బాటిల్స్ వాడుతున్నాం . అంతేకాదు.. ఇప్పుడు రెస్టారెంట్లలో రాగి జగ్గులు, గ్లాస్ లు కనిపిస్తున్నా యి.
ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
రాగి పాత్రలు వైరస్, బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. రాగి పాత్రలలో నీళ్లు తాగితే మంచిదని ఆయుర్వేదం కూడా చెప్తోంది. అయితే ఒకప్పటి ఈజిఫ్టియన్లు నీళ్లను రాగి పాత్రలలో ఉంచడం వల్ల అవి ఫ్రెష్ గా ఉంటాయని నమ్మేవాళ్లు. సైన్స్ ప్రకారం రాగి పాత్రలు ఫుడ్ పాయిజినింగ్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అమెరికాలోని పాత ఇళ్లలో ఇప్పటికీ రాగి వాటర్ పైప్ లైన్లే ఉన్నాయి. బాడీలో మెటబాలిజం పెరగడానికి కొన్నిరకాల మినరల్స్ అవసరమవుతాయి. ఐరన్ , జింక్, మెగ్నీషియం వంటివే కాకుండా కాపర్ కూడా అవసరమే. రాగి పాత్రలో నిల్వ ఉంచిన రెండు లీటర్ల నీళ్లను తాగితే మన శరీరానికి అవసరమైన దానిలో 40 శాతం కాపర్ పొందగలుగుతాం. ఇప్పటికీ నదుల్లో నాణేలు వేస్తారు. దాని వెనక ఉన్న సీక్రెట్ కూడా ఇదే. అప్పట్లో రాగి నాణేలు ఉండేవి. వాటిని నీళ్లల్లో వేయడం వల్ల ఆ నదుల్లో నీళ్లు తాగినవాళ్లకు కాపర్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. ఇది తెలియక అల్యూమినియం, నికెల్ కాయిన్స్‌ను ఇప్పుడు నదుల్లో వేస్తున్నారు. ఇది నదిని మరిం త కలుషితం చేయడమే.
– డాక్టర్ శ్రీనివాస్ , నేచురోపతి,
సంస్కార్ ప్రకృతి చికిత్సాలయం,
అక్బర్ నగర్ , నిజామాబాద్.
సర్ఫేస్ కు కాపర్ కోటింగ్
కోవిడ్ –19 వైరస్ ను స్ప్రెడ్ చేస్తున్నవాటిలో సర్ఫేస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. 65 శాతం వైరస్ వ్యాప్తి కేవలం సర్ఫేస్ వల్లే జరుగుతోంది. అందుకే ఇప్పుడు సైంటిస్టులంతా సర్ఫేస్ ను వైరస్ , బ్యాక్టీరియా ఫ్రీగా మార్చడం ఎలా.. అనే దానిపైనే రీసెర్చ్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు తలుపులకు గొళ్లాలు, సీలలు వంటివి రాగితో చేసినవే వాడేవాళ్లు. అంతే కాకుండా రాగి రేకుపై రకరకాల చిత్రాలు చెక్కి తలుపులు, దర్వాజలపై పెట్టేవాళ్లు. ఇందుకు కారణం ఏమిటంటే.. రాగికి సూక్ష్మ జీవులను చంపే గుణం ఉండడమే. గాలి ద్వారా ఇంట్లోకి వచ్చే సూక్ష్మజీవులను తలుపులపై ఉండే రాగి రేకులు, గొళ్లాలు, సీలలు చంపేసేవి. దీని వల్ల ఇంట్లోకి సూక్ష్మ జీవులు పెద్దగా వచ్చేవి కాదు. తలుపులను తాకినా, గొళ్లాలను తాకినా అవి కూడా వైరస్ , బ్యాక్టీరియా ఫ్రీగా ఉండేవి. ఇదే సూత్రాన్ని ఇప్పుడు కూడా అప్లయ్ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు సైంటిస్టులు. మనం తరచూ తాకే సర్ఫేస్ లపై రాగి వంటి యాంటి వైరల్, యాంటి బ్యాక్టీరియల్ పూత పూస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్లాస్టిక్, ఐరన్ , అల్యూమినియం, సిమెంట్ సర్ఫేస్ లపై రోజుల తరబడి బతికుండే సూక్ష్మ జీవులు రాగిపై కేవలం గంట నుంచి రెండు గంటలే. పైగా ఈ రెండు గంటల్లో 99.9 శాతం వైరస్ ను బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. వెండి కంటే కూడా రాగి చాలా వేగంగా పని చేస్తుంది. అయితే రాగి వాడకం తగ్గడానికి కారణం.. రాగి ధర ఎక్కువ కావడమే కాకుండా చాలా త్వరగా చిలుము పడుతుంది. దీంతో క్లీన్ చేయడం ఇబ్బందికరంగా పాత్రలను వాడడానికి ఇష్టపడడం లేదు. అయితే రాగి అందించే ఆరోగ్య ప్రయోజనాలతో పోలిస్తే ధర, క్లీన్ చేయడానికి పట్టే శ్రమ తక్కువే. లేజర్ టెక్నాలజీని వాడి రాగితో సర్ఫేస్ లను కవర్ చేసేందుకు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ సైంటి స్టులు రీసర్చి చేస్తున్నారు.


