లోయెస్ట్ బిడ్ సిండ్రోమ్.. 22లక్షల మంది NEET విద్యార్థుల కొంప ముంచిందా?

లోయెస్ట్ బిడ్ సిండ్రోమ్.. 22లక్షల మంది NEET విద్యార్థుల కొంప ముంచిందా?

నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, పరీక్ష రద్దు తర్వాత.. పరీక్షల నిర్వహణపై పలు అనుమానాలు..పేపర్ లీక్ ఎలా జరిగింది.. కట్టుదిట్టమైన భద్రత నిఘాలో ఉండే ఎగ్జామ్ పేపర్లు  రెండు రోజుల ముందే ఎలా లీక్ అయ్యాయి.. ఇలాంటి సందేహాలెన్నో..అంతేకాదు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఘటన మన భారత దేశ ప్రొక్యూర్ మెంట్  సిస్టమ్ పై కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా పేపర్ ప్రింటింగ్ బిడ్డింగ్ లో లోపాలను ఎత్తి చూపుతున్నాయి.పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నపత్రం బయటకు రావడం, పరీక్ష రద్దుకు దారితీసిన ఈ ఘటన వెనుక వ్యక్తుల నిర్లక్ష్యం మాత్రమే కాదు..ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఉన్న లోయర్ బిడ్ సిండ్రోమ్ అనే ప్రమాదకర ధోరణి కూడా ప్రధాన కారణం కావొచ్చని భావిస్తున్నారు.  

లోయర్ బిడ్ సిండ్రోమ్.. ప్రస్తుత మన దేశంలో రాజ్యమేలుతున్న ప్రొక్యూర్ మెంట్ సిస్టమ్ విధానం..సాధారణంగా భారతీయుల్లో ఏది తక్కువకు వస్తే అది కొనాలనే మనస్తత్వం ఉంటుంది.  నాణ్యత పక్కన బెట్టి తక్కువ ధరకు ప్రాడక్ట్ వస్తే చాలు అని అనుకుంటారు. ఇది వ్యక్తిగతం అయితే అతని నష్టం వాటిల్లవచ్చు. కానీ ఇప్పుడు అత్యంత కీలకమైన వ్యవస్థలలో కూడా ఈ ధోరణి కనబడుతోంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్  విషయంలో లోయర్ బిడ్ సిండ్రోమ్ ద్వారా జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రభుత్వ, కీలక వ్యవస్థల టెండర్ విధానంలోని లోపాలపై ఆందోళనలు వ్యక్తమవుతోంది. అనుభవం, సామర్థ్యం ఉన్న సంస్థలకు కాకుండా అత్యంత తక్కువ కోట్ చేసిన సంస్థలకు నీట్ ఎగ్జామ్ పేపర్ల కాంట్రాక్టులు కేటాయించారని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 

బెస్ట్ టెక్నాలజీ ఏవెల్యూయేషన్ , దశాబ్దాల అనుభవం ఉన్న కంపెనీలు ఉన్నప్పటికీ  కేవలం తక్కువ కోట్ కారణంగా నీట్ ఎగ్జామ్ పేపర్ ప్రింటింగ్ కాంట్రాక్టు ను అర్హత లేని కంపెనీకి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఎగ్జామ్ పేపర్ నిర్వహణ కాంట్రాక్టుకోసం  ప్రముఖ కంపెనీ టీసీఎస్, ఎడ్యుక్వెస్ట్ సంస్థలు  పోటీ పడ్డాయి. టీసీఎస్ ఒక్కో అభ్యర్థికి రూ. 311 లు కోట్ చేయగా.. ఎడ్యుక్వెస్ట్ రూ.171 లు కోట్ చేసింది. ఈ రంగంలో అనుభవం, బెస్ట్ టెక్నాలజీ  ఉన్నప్పటికీ ఉన్న టీసీఎస్ ను పక్కనబెట్టి కేవలం తక్షణ ఖర్చు ఆదాకు ప్రాధాన్యతనిచ్చి  రూ.171 లకు కోట్ చేసిన ఎడ్యుక్వెస్ట్ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.  ఇది ప్రభుత్వ ,సంస్థాగత టెండర్లలో లోపాలను ఎత్తిచూపుతోంది. స్వల్పకాలిక బడ్జెట్ ఉపశమనం కోసం విద్యార్థుల భవిష్యత్తు ను పణంగా పెట్టాయని ఆరోపణలు వస్తున్నాయి. 

►ALSO READ | నీట్ రద్దు వివాదం: డాక్టర్ కావాలన్న కల చెదిరి వైద్యవిద్యార్థి ఆత్మహత్య

సంచలనం సృష్టించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్.. 

జాతీయ అర్హత పరీక్ష (నీట్‌ యూజీ-2026)కు సంబంధించిన ప్రశ్నపత్రం రాజస్థాన్‌లో లీకవడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది.  కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించనక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక, ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.

ఈనెల 3న జరిగిన నీట్‌ పరీక్షలో కెమిస్ట్రీ సబ్జెక్టు నుంచి వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును గుర్తించినట్లు రాజస్థాన్‌ పోలీసులు. ఈ మెటీరియల్‌ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చినట్లు గుర్తించారు. ఇందులోని సమాచారం.. నీట్‌ ప్రశ్నపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉన్నాయి. కొన్ని ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది.

ఆ ప్రాక్టీసు పేపరు కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్‌ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి ఈనెల 1న సికార్‌లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్‌ ఇచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత అది పీజీ వసతిగృహాలు, కోచింగ్‌ నెట్‌వర్క్‌లు, కెరీర్‌ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని అధికారులు తెలిపారు. ఆ మెటీరియల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా ప్రశ్నలు  చేతిరాతతో రాశారు. 

లీకైన ప్రశ్నలను విద్యార్థులకు రూ.20వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించామని రాజస్థాన్‌ పోలీసు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.