కోవిడ్‌‌‌‌‌‌‌‌-19 పూర్తిగా అంతరించిపోలే.. అప్రమత్తంగా ఉండాలి: ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్

కోవిడ్‌‌‌‌‌‌‌‌-19 పూర్తిగా అంతరించిపోలే..  అప్రమత్తంగా ఉండాలి: ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: కోవిడ్​ పూర్తిగా అంతరించిపోలేదని, పొరుగు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయని , కానీ  ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్, జనసేన పార్టీ నేత గడల శ్రీనివాసరావు ఆరోపించారు.  

గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. ఒమిక్రాన్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌ వేరియంట్లు ఇంకా వ్యాప్తిలో ఉన్న నేపథ్యంలో  సర్కారు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.  

రాష్ట్రంలో కోవిడ్‌‌‌‌‌‌‌‌ కేసులు, మరణాలపై సమాచారం వస్తున్నప్పటికీ ప్రభుత్వం పారదర్శకంగా అధికారిక హెల్త్‌‌‌‌‌‌‌‌ బులెటిన్లు విడుదల చేయడం లేదన్నారు. లక్షణాలు ఉన్నవారికి కోవిడ్‌‌‌‌‌‌‌‌ పరీక్షలు నిర్వహించడం లేదన్నారు.