క్షమించండి..ఎన్ కౌంటర్ పై యూటర్న్ తీసుకున్న నారాయణ

క్షమించండి..ఎన్ కౌంటర్ పై యూటర్న్ తీసుకున్న నారాయణ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్థిస్తున్నానని.. తాను చేసిన వ్యాఖ్యలను యూటర్న్ తీసుకున్నారు సీపీఐ నేత నారాయణ. తాను చేసిన వ్యాఖ్యలపై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కొందరు తప్పుబట్టారని అన్నారు. బూటకపు ఎన్ కౌంటర్లకు పార్టీ వ్యతిరేమని తీర్మానం చేసిందన్నారు.  పార్టీ  సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినందున వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతేగాకుండా తన వ్యాఖ్యలపట్ల పార్టీకి,  ప్రజలకు  క్షమాపణ చెప్పారు.