V6 News

ఓపీఎస్‌‌‌‌‌‌‌‌కు సరే.. మరి సీపీఎస్ మాటేంది?..రూ. వెయ్యి కోట్లలో మా వాటా చెప్పాలి: స్థితప్రజ్ఞ

ఓపీఎస్‌‌‌‌‌‌‌‌కు సరే.. మరి సీపీఎస్ మాటేంది?..రూ. వెయ్యి కోట్లలో మా వాటా చెప్పాలి: స్థితప్రజ్ఞ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం రిటైర్డ్ ఓపీఎస్ ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే.. దీనిలో సీపీఎస్ ఉద్యోగుల వాటా ఎంతో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఓపీఎస్ వారికి తీపి కబురు చెప్పిన సర్కారు, సీపీఎస్ ఉద్యోగుల బకాయిల విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పదవీ విరమణ చేసిన సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి అటు సీపీఎస్ లేదు.. ఇటు ఓపీఎస్ లేదు అన్నట్టుగా తయారైందని స్థితప్రజ్ఞ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాన్ అకౌంట్లలో ఫైనల్ పేమెంట్ జమ కాకపోవడంతో వారికి సీపీఎస్ పెన్షన్ రావడం లేదని, మరోవైపు పాత పెన్షన్ వర్తించదని చెప్పారు.

చేతిలో డబ్బులు లేక, పెన్షన్ అందక రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను వెంటనే ప్రాన్ అకౌంట్లలో జమ చేసి, ఫైనల్ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.