V6 News

డిగ్రీ, పిజి చేసినోళ్లకు RBIలో కొలువుల జాతర: అర్హతలు, పరీక్ష తేదీ, పూర్తి వివరాలు ఇవే!

డిగ్రీ, పిజి చేసినోళ్లకు RBIలో కొలువుల జాతర: అర్హతలు, పరీక్ష తేదీ, పూర్తి వివరాలు ఇవే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) గ్రేడ్ బి ఆఫీసర్స్ (డీఆర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 29న ప్రారంభమై మే 20న ముగుస్తుంది.  

పోస్టు పేరు: గ్రేడ్ బి ఆఫీసర్స్ (డీఆర్) 

మొత్తం ఖాళీలు: 60.

విభాగాల వారీగా ఖాళీలు: గ్రేడ్ బి (డీఆర్) – జనరల్ 40, గ్రేడ్ బి (డీఆర్) – డీఈపీఆర్ 10, గ్రేడ్ బి (డీఆర్) – డీఎస్ఐఎం 10. 

ఎలిజిబిలిటీ
జనరల్ స్ట్రీమ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 

డీఈపీఆర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్/ ఎకనామిట్రిక్స్​లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.

డీఎస్ఐఎం: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్​లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 

వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు,  ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 29.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600. ఆర్​బీఐ స్టాఫ్​కు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: మే 20. 

ఫేజ్ I ఎగ్జామ్ (జనరల్): జూన్ 13.
ఫేజ్ I ఎగ్జామ్ (డీఈపీఆర్/ డీఎస్ఐఎం): జూన్ 14
ఫేజ్ II ఎగ్జామ్ (జనరల్): జులై 25.
ఫేజ్ II ఎగ్జామ్ (డీఈపీఆర్/ డీఎస్ఐఎం): జులై 26.

సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.rbi.org.inను సందర్శించండి.