V6 News

టెన్త్ ఫలితాల్లో కరీంనగర్‌ సిద్దార్థ విజయదుందుభి

టెన్త్ ఫలితాల్లో కరీంనగర్‌ సిద్దార్థ విజయదుందుభి

కరీంనగర్ టౌన్,వెలుగు:  టెన్త్ ఫలితాల్లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిద్దార్థ స్కూల్ విద్యార్థులు విజయదుందుభి  మోగించినట్లు చైర్మన్ దాసరి శ్రీపాల్  రెడ్డి తెలిపారు. కె.విశ్వక్ సేన 592 మార్కులు సాధించి జిల్లా టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచినట్లు వెల్లడించారు. 31మంది  విద్యార్థులు 570కు పైగా,74మంది విద్యార్థులు 560కు పైగా,122మంది విద్యార్థులు550కు పైగా మార్కులు సాధించారన్నారు. 452మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి, పాల్గొన్నారు. 

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు (జ్యోతి ఐఐటీ అకాడమీ, మానస, సూర్య గ్లోబల్ స్కూల్స్) ప్రభంజనం సృష్టించాయి. విద్యార్థులు 591, 590 మార్కులతో జిల్లా స్థాయిలో సత్తా చాటారు. మానస స్కూల్‌‌‌‌‌‌‌‌కు చెందిన కవలలు యశస్విని, తేజశ్రీ ఇద్దరూ 582 చొప్పున మార్కులు సాధించడం విశేషం. వీరితో పాటు 21 మందికి పైగా 580కి పైగా, 63 మంది 570కు పైగా, 149 మంది 550కు పైగా, మొత్తం 324 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. విద్యార్థులను, టీచర్లను డైరెక్టర్లు బోయినపల్లి శ్రీధర్ రావు, బియ్యాల హరి చరణ్ రావు అభినందించారు.