- సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ప్రయోజనాలు సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులందరికీ అందాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్(సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మెమో జారీ చేయడం శుభపరిణామమని, అయితే డేటా సేకరణలో సీపీఎస్ బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.
సాధారణంగా రిటైర్డ్ ఉద్యోగుల వివరాల నమోదుకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్(పీపీవో) నంబర్ అవసరమవుతుందన్నారు. అయితే, సీపీఎస్ విధానంలో రిటైరైన వారికి ఆ నంబర్ ఉండదని గుర్తు చేశారు. పీపీవో నంబర్లేకున్నా సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు ఇవ్వాలన్నారు. వారికున్న ప్రాన్ ఐడీ ఆధారంగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో వివరాలు నమోదుకు సాఫ్ట్‌వేర్‌లో వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు.
