సుల్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బజార్ లో నంబర్ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చిన వ్యక్తిపై క్రిమినల్ కేసు

సుల్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బజార్ లో నంబర్ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చిన వ్యక్తిపై క్రిమినల్ కేసు

సుల్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బజార్, వెలుగు: వాహనం అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చి నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్న ఓ వాహనదారుడిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ వెల్లడించారు. హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఖాంచందాని బలరామ్ (59) ట్రాఫిక్​ చలానాలు తప్పించుకునేందుకు తన హోండా యాక్టివా వాహనం అసలు రిజిస్ట్రేషన్ నంబర్ మార్చి నకిలీ నంబర్ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వినియోగిస్తున్నాడు.

నకిలీ నంబర్ ప్లేట్ కారణంగా కవాడిగూడకు చెందిన ఎస్.విజయ్ హోండా యూనికార్న్ వాహనానికి ట్రాఫిక్ చలానాలు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సుల్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బజార్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రిమినల్ కేసు నమోదు చేసి, నిందితుడికి నోటీసులు జారీ చేశారు.