పెళ్లయిన విషయం దాచి.. మరో యువతిని మోసం చేశాడు

పెళ్లయిన విషయం దాచి.. మరో యువతిని మోసం చేశాడు
  • విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని.. అవసరం తీరాక  మొహం చాటేశాడు

హైదరాబాద్: తనకు పెళ్లయి.. పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని నమ్మించి అవసరం తీరాక మొహం చాటేశాడో ప్రబుద్ధుడు. పెళ్లయిన విషయాన్ని తొలుత గుర్తించి ప్రశ్నిస్తే.. విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి అవసరం తీరాక మొహం చాటేశాడు. దీంతో మోసపోయిన బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా.. నిందితుడిపై క్రమినల్ కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. 
జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలోని ఫార్మశీ విభాగంలో పనిచేస్తున్న కొండబాబు కు ఇది వరకే పెళ్లయింది. అయితే మూడేళ్ల క్రితం మరో యువతి పరిచయం కావడంతో తనకు పెళ్లి కానట్లు నటించి ఆమెతో ప్రేమాయణం సాగించాడు. ఏడాది క్రితం పెళ్లయినట్లు గుర్తించి నిలదీస్తే.. ఆమెకు విడాకులిచ్చి నిన్ను చేసుకుంటానని మభ్యపెట్టాడు. మోజు తీరాక మొహం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.