CSK vs KKR: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కాన్వే

CSK vs KKR: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కాన్వే

చెన్నైతో జరుగుతోన్న  మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై అదరగొడుతోంది.  రుతురాజ్ గైక్వాడ్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి  ఔటయ్యాడు. మరో ఓపెనర్ కాన్వే దుమ్మురేపుతున్నాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం  అజింక్యా రహానే(11) పరుగులతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నై11 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. 

ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడిన చెన్నై నాలుగు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో  మూడో స్థానంలో ఉంది. ఇక  కోల్ కతా నైట్ రైడర్స్ ఆరు మ్యాచ్ లు ఆడి కేవలం రెండు మ్యాచ్ లే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.