కరెంట్​, ఆర్టీసీ చార్జీలు తడిసిమోపెడు

కరెంట్​, ఆర్టీసీ చార్జీలు తడిసిమోపెడు

రాష్ట్రంలో కరెంట్, ఆర్టీసీ చార్జీలూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కరెంట్​ చార్జీలు దాదాపు రెట్టింపయ్యాయి. నిరుడు మార్చిలో ఒక్కో యూనిట్​పై రాష్ట్ర సర్కారు 50 పైసలు పెంచగా.. కస్టమర్​ చార్జీలనూ డబుల్​ చేసింది. ఈ నేపథ్యంలోనే కరెంట్​ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. గతంలో సగటున నెలకు రూ.200 వచ్చే బిల్లు కాస్తా ఇప్పుడు ఏకంగా రూ.400దాకా వస్తున్నది.

కొత్త శ్లాబులతో బిల్లులు డబుల్​ అయ్యాయి. వాటికి తోడు ఏసీడీ చార్జీల పేరిట ఇటీవల జనం నుంచి డిస్కంలు వసూలు చేశాయి. దానికి తోడు బస్​ చార్జీలనూ ఆర్టీసీ పెంచింది. రౌండాఫ్​ పేరుతో ఓసారి, సెస్​ల రూపంలో రెండు సార్లు చార్జీలను పెంచింది. దానికితోడు బస్​ పాస్​ ధరలనూ భారీగా పెంచారు.

ఏకంగా మూడు రెట్లు పెంచడంతో స్టూడెంట్లు, చిన్న చిన్న ఉద్యోగస్తులకు తిప్పలు తప్పడం లేదు. ఇటీవలే టోల్​ చార్జీలు పెరగడంతో.. ఆ భారాన్నీ ప్రయాణికులపైనే ఆర్టీసీ వేస్తున్నది. రూ.10 నుంచి రూ.20 వరకు పెంచింది.