కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన ప్లేయర్స్ కు గ్రాండ్ వెల్కమ్

కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన ప్లేయర్స్ కు గ్రాండ్ వెల్కమ్

బర్మింగ్‌హామ్‌లో ఇటీవలే పూర్తయిన కామన్వెల్త్ క్రీడలు 2022లో సత్తా చాటి, దేశానికి పతకాలను సాధించి పెట్టిన భారత బాక్సర్లు అమిత్ పంఘల్, రోహిత్ టోకాస్, జాస్మిన్ లంబోరియా, సాగర్ అహ్లావత్ లకు వారి కుటుంబాలు, సన్నిహితులు ఘనస్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు పతకాలు గెలుచుకున్న క్రీడాకారులకు హృదయపూర్వక ఆహ్వానం పలికారు. వారికి పూలమాల వేసి, విమానాశ్రయంలో మిఠాయిలు పంచిపెట్టారు. డ్రమ్స్, చీర్స్ ధ్వనులతో అక్కడి వాతావరణమంతా సందడిగా మారిపోయింది. దీంతో క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.

బాక్సర్లు ఫ్యాన్స్ అభిమానానికి పరవశించిపోయారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో దేశం యొక్క ప్రతిష్ట, కీర్తిని ఇలాగే నిలబెడుతూ ఉంటానని అమిత్ పంఘల్ చెప్పాడు. ఇటీవల ముగిసిన CWG 2022 ఫైనల్‌లో, అమిత్ పంఘల్ ఇంగ్లాండ్‌కు చెందిన కైరన్ మక్‌డొనాల్డ్‌ను ఓడించి దేశానికి స్వర్ణం సాధించాడు. ఆదివారం జరిగిన -51 కిలోల (ఫ్లై వెయిట్) మ్యాచ్‌లో పంఘల్ తిరుగులేని సత్తా చాటాడు. ఈ విధంగా భారత బాక్సర్ 5-0 తేడాతో టైటిల్‌ను గెలుచుకున్నాడు.

ఇది తను సాధించిన విజయాలన్నింటినిలోనూ అత్యంత ఉత్తమైననదని బాక్సర్ నీతూ ఘంగాస్‌ స్పష్టం చేశారు. తాను ఇలాగే ముందుకు సాగి, దేశానికి స్వర్ణం సాధిస్తూనే ఉంటానని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళల 48 కేజీల విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన డెమీ-జాడే రెజ్టన్‌ను ఓడించిన నీతూ ఘంగాస్... బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 

బాక్సర్ రోహిత్ టోకాస్ కూడా విమానాశ్రయంలో సాదర స్వాగతం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. తనకు స్వాగతం పలికేందుకు తమ గ్రామం నుండి ప్రజలు ఇక్కడికి వచ్చారని.. వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అతను చెప్పాడు. జాంబియాకు చెందిన స్టీఫెన్ జింబా చేతిలో ఓడిపోయిన తర్వాత, పురుషుల 67 కేజీల వెల్టర్‌వెయిట్ విభాగంలో టోకాస్ కాంస్య పతకాన్ని సాధించాడు.

జైస్మిన్ లంబోరియా విమానాశ్రయంలో స్వాగతం పలికినందుకు ప్రశంసలు వ్యక్తం చేసింది. ఆమె కోచ్‌కి తన స్వర్ణాన్ని అంకితం చేసింది. తాను బంగారు పతకాన్ని గెలుచుకోవడంపై చాలా సంతోషంగా ఉన్నానని ఆమె  తెలిపారు. ఇంగ్లండ్‌కు చెందిన గెమ్మా పైగే చేతిలో ఓడిపోయిన తర్వాత, జైస్మిన్ లంబోరియా మహిళల 60 కిలోల లైట్‌వెయిట్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 

పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్‌ అహ్లావత్‌ రజతం సాధించడంతో బాక్సింగ్‌లో భారత ప్రస్థానం సమాప్తమైంది. పదో రోజు సాగర్‌ అహ్లావత్‌.. ఇంగ్లండ్‌కు చెందిన డెలిసియస్‌ ఓరీ చేతిలో 5-0 తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ 2022 సోమవారం బర్మింగ్‌హామ్‌లోని అలెగ్జాండర్ స్టేడియంలో ముగింపు వేడుకతో ముగిసింది. 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది.