OMG : నాన్న అమ్మను కొడుతున్నాడని.. కూతురు ఆత్మహత్య

OMG : నాన్న అమ్మను కొడుతున్నాడని.. కూతురు ఆత్మహత్య

తన తండ్రి ప్రతి రోజూ తాగోచ్చి అమ్మను కొడుతున్నాడని 17 ఏళ్ల బాలిక  మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన  మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో చోటుచేసుకుంది.  తన తండ్రి తాగుబోతు అని, తరచూ తన తల్లిని కొట్టేవాడని ఆ యువతి సూసైడ్ నోట్‌లో రాసింది.  తన తండ్రిపై  పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ తెలిపింది.  మృతురాలి చెల్లెలు కూడా తమ తండ్రి ఎక్కువగా మద్యం సేవించి తల్లిపై దాడికి పాల్పడ్డాడని తెలిపింది.  పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించింది. 

అయితే తమపై వచ్చిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. బాలిక తండ్రిపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామన్నారు.  బాలిక తండ్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖర్గోన్ పోలీస్ సూపరింటెండెంట్ ధర్మరాజ్ మీనా తెలిపారు. గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు చర్యలు తీసుకుని అరెస్ట్ చేశారని తెలిపారు. మద్యం సేవించి తన భర్త తనను కొట్టేవాడని తెలిపింది. తండ్రి తీరుతో మనస్తాపం చెంది తమ కూతురు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని వాపోయింది.