ఐపీఎల్ టికెట్ల పేరిట సైబర్ మోసాలు...అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్

ఐపీఎల్ టికెట్ల పేరిట సైబర్ మోసాలు...అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్

బషీర్​బాగ్, వెలుగు: ఐపీఎల్ టికెట్ల పేరిట జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఉప్పల్ స్టేడియంలో ఈనెల 22న జరగనున్న సన్​రైజర్స్ హైదరాబాద్​– రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరి మ్యాచ్​కు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్​లు, వెబ్​సైట్లతో మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 

అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ‘డిస్ట్రిక్ట్’ యాప్​ను పోలిన లోగోలతో సోషల్ మీడియాలో తక్కువ ధరలకే టికెట్లు ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి అనధికారిక లింకులను నమ్మి బుక్ చేసుకుంటే డబ్బులతో పాటు బ్యాంకింగ్ వివరాలు కూడా సైబర్ కేటుగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.