మతం మారితే ఎస్సీ హోదా రద్దు చేయాలి దళిత హిందూ హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్

మతం మారితే ఎస్సీ హోదా రద్దు చేయాలి   దళిత హిందూ హక్కుల  పరిరక్షణ వేదిక డిమాండ్

పంజాగుట్ట, వెలుగు: దళిత క్రైస్తవుల విషయంలో కొందరు నాయకులు సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టడం అన్యాయమని దళిత హిందూ హక్కుల పరిరక్షణ వేదిక ఆరోపించింది. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌‌క్లబ్​లో ‘మతం మారిన దళితులకు ఎస్సీ హోదా రద్దు’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్‌‌కుమార్ మాట్లాడారు. 

దళిత క్రైస్తవ నాయకులు ద్వంద్వ నీతితో హిందూ దళితులను మోసం చేస్తున్నారని, రెండు విధాలుగా లబ్ధి పొందుతూ అసలైన దళిత హిందువుల రాజ్యాంగ ఫలాలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. దళిత హిందువుల హక్కుల రక్షణ కోసం ఏర్పడిన జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్​కు తాము దళిత హిందువుల పరిస్థితులను వివరించామని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వరాదని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే మతం మారిన వారిని గుర్తించి ఎస్సీ హోదాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కల్యాణ్, ప్రవీణ్ కుమార్, నవత, కొంపల్లి అరవింద్ కుమార్ పాల్గొన్నారు.