ధావన్ను కావాలనే పక్కనపెట్టారు

ధావన్ను కావాలనే పక్కనపెట్టారు

గతేడాది టీమిండియాకు కెప్టెన్..ఈ ఏడాది అసలు జట్టులోనే లేడు. ఏడాదిలో ఎంత మార్పు. 2021లో శ్రీలకంలో పర్యటించిన భారత జట్టుకు టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. మూడు మ్యాచ్ల టీ-20, వన్డే సిరీస్ ఆడేందుకు శిఖర్ ధావన్ సారథ్యంలో  కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ శ్రీలంకకు పంపింది. వన్డే సిరీస్ను 2-1తో దక్కించుకున్న భారత జట్టు..టీ-20 సిరీస్ను 1-2తో కోల్పోయింది. అయితే కెప్టెన్గా శిఖర్ ధావన్కు మంచి మార్కులే పడ్డాయి. అటు ప్లేయర్గానూ రాణించాడు. మూడు వన్డేల్లో 128 రన్స్ చేయగా..మూడు టీ20ల్లో 86 పరుగులు కొట్టాడు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్తో వన్డే సిరీస్ కు ఎంపికయ్యాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ధావన్ ఒకే మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మిగతా మ్యాచుల్లో అతన్ని రిజర్వ్ బెంచ్కే పరిమితం చేశారు. 

ఫాంలో ఉన్నా..ఎంపిక చేయలేదు
ఇక 2022 ఐపీఎల్లో పంజాబ్ తరపున ఆడిన ధావన్..14 మ్యాచుల్లో  460 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి. ధావన్ రాణించడంతో.. టీమిండియాకు ఎంపికవుతాడని అంతా అనుకున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్కు అతను సెలెక్ట్ అవుతాడని భావించారు. కానీ..సీన్ రివర్స్ అయింది. బీసీసీఐ అతన్ని పక్కనపెట్టేసింది. అయితే ధావన్ను ఎంపిక చేయని బీసీసీఐ..ఐపీఎల్లో రాణించిన కుర్రాళ్లకు సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో చోటిచ్చింది. అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రుతరాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్లను సెలెక్ట్ చేసింది. సీనియర్లు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతినిచ్చి..కేఎల్ రాహుల్కు కెప్టెన్సీ అప్పగించింది. అయితే గాయం కారణంగా రాహుల్ తప్పుకోవడంతో..పంత్కు కెప్టెన్సీ అప్పగించింది.  కానీ పంత్ సారథ్యంలో టీమిండియా దారుణంగా ఆడుతోంది. 

ఫ్యాన్స్ గరం..
బీసీసీఐ తీరుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. పంత్, కేఎల్ రాహుల్ కంటే సీనియర్ అయిన ధావన్ను సెలెక్ట్ చేయకపోవడంపై మండిపడుతున్నారు. ఆటగాడిగా, కెప్టెన్గా అనుభవమున్న ధావన్ ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. మంచి ఫాంలో ఉన్నప్పుడు ధావన్ను కావాలనే పక్కనపెట్టారని చెబుతున్నారు. అనుభవం లేని కారణంగానే పంత్ సారథ్యంలోని టీమిండియా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు. ధావన్ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదంటున్నారు. 

కావాలనే పక్కనపెట్టారు..
ఫాంలో ఉన్న ధావన్ను సౌతాఫ్రికా సిరీస్కు  ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. అతన్ని ఎంపి చేసి ఉంటే ప్రస్తుతం సౌతాఫ్రికా సిరీస్లో ధావన్ అనుభవం పనికివచ్చేదంటున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో శిఖర్ ధావన్‌ని ఆడించాలని అనుకుంటే, సౌతాఫ్రికా సిరీస్‌కి ఎంపిక చేసేవాళ్లని..ధావన్ను వరల్డ్ కప్ కు ఎంపిక చేయాలని అనుకోనందుకే అతన్ని పక్కనపెట్టేశారని చోప్రా కుండబద్దలు కొట్టాడు. ఆటగాళ్ల సెలక్షన్ పర్ఫామెన్స్ మీద జరగాలని..కానీ..ధావన్ రాణించినా..ఎంపిక చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నాడు. లాస్ట్ ఇయర్ కెప్టెన్‌గా ఉన్న ధావన్..ఇప్పుడు జట్టులోనే లేకపోవడం  ఆశ్చర్యంగా ఉందన్నాడు. ధావన్కు మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో ధావన్కు మంచి రికార్డు ఉందని..వరుసగా ఐదు ఐపీఎల్ సీజన్లలో 500 పరుగులకు పైగా రన్స్ చేశాడని చెప్పాడు. అటు టీ20 వరల్డ్ కప్లో  కుర్రాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతోనే బీసీసీఐ ధావన్ ను  కావాలని పక్కనబెట్టిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు .