రాష్ట్రంలో రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యల్పంగా 11డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో సాధారణం కంటే.. మరో 2 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.