మాజీ ప్రియుడికి కౌంటర్ ఇచ్చిన రాఖీసావంత్

మాజీ ప్రియుడికి కౌంటర్ ఇచ్చిన రాఖీసావంత్

స్టార్ హీరోయిన్లకు వేధింపులు తప్పడం లేదు.పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ను ఆమె మాజీ ప్రియుడు దీపక్ బెదిరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. తనను రాఖీ సావంత్ మోసం చేసిందని దానికి రూ. 4 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. నాలుగు రోజుల్లో ఇవ్వకపోతే తన ‘జీవితాన్ని నాశనం చేస్తానంటూ’ హెచ్చరించారు. దీనికి ఆమె కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. ‘నన్ను నువ్వు ఏం చేయలేవు.. నాగురించి కానీ నా భర్త గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఊరుకునేదిలేదు’ అంటూ ఇన్‌స్ట్రాగ్రాంలో వరుసగా వీడియోలు పోస్ట్ చేసింది.

రాఖీ సావంత్ కొన్ని రోజుల క్రితం దీపక్ అనే వ్యక్తితో ప్రేమాయనం నడిపింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ తర్వాత ఇద్దరూ వీడిపోవడంతో రాఖీ  రహస్యంగా  ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అతడు యూకే వెళ్లిపోగా….రాఖీ వీసా కోసం ఎదురుచూస్తోంది. వీసా రాగానే ఆమె తన భర్త దగ్గరకు వెళ్లి యూకేలోనే స్థిరపడనుంది.