AHa OTT Thriller: ఉత్కంఠరేపే తెలుగు థ్రిల్లర్ సిరీస్.. ‘పోచమ్మ’ ట్రైలర్ గూస్‌బంప్స్..

AHa OTT Thriller: ఉత్కంఠరేపే తెలుగు థ్రిల్లర్ సిరీస్.. ‘పోచమ్మ’ ట్రైలర్ గూస్‌బంప్స్..

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్లో ఒకటైన ‘ఆహా వీడియో’ (Aha Video)..మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ముందుంటుంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ, కామెడీ డ్రామా వంటి జోనర్స్లో సినిమాలు తీసుకొచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, తమిళం డబ్బింగ్, రీమేక్స్ కూడా ఈ ఓటీటీలో చూడొచ్చు. ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు మిస్టికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆ వివరాలు ఏంటో చూసేద్దాం. 

‘పోచమ్మ’ (Pochamma):

అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రల్లో నటించిన వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ‘పోచమ్మ’ (Pochamma). రమేష్ ఇంద్ర దర్శకత్వంలో శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా వస్తోన్న ఈ సిరీస్‌‌‌‌ ఏప్రిల్ 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ వెబ్ సిరీస్ను విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక శాపగ్రస్తమైన బంగ్లా చుట్టూ తిరిగే కథతో సాగిన పోచమ్మ ట్రైలర్ ఉత్కంఠగా ఉంది. ‘పోచమ్మకు కాపాడటం తెలుసు, వేధించడం తెలుసు, అవసరమైతే చంపడం కూడా తెలుసు’ లాంటి డైలాగ్స్‌‌‌‌ సిరీస్‌‌‌‌పై ఆసక్తిని పెంచాయి. తన గొప్పతనం, మహిమను అంచనా వేయక, తప్పులు చేసే వాళ్లను పోచమ్మ దేవత ఎలా శిక్షించింది? తనను పూజించే వారిని ఎలా రక్షించింది? అనే అంశాలను సిరీస్ లో ఆసక్తిగా చూపించనున్నారు. 

ఈ సినిమాకు గ్రామదేవత పేరైన ‘పోచమ్మ’ అని టైటిల్ ఫిక్స్ చేసుకోవడంతోనే మేకర్స్ సక్సెస్ అయ్యారు. అందుకు తగ్గట్టుగానే సినిమాలో ఆసక్తి పెంచే మైథాలజీ, తెలుగు నేటివిటీని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఇక మొత్తం సిరీస్లో కూడా ఉత్కంఠ రేపే గ్రిప్పింగ్ సీన్స్ పడితే హిట్ అవ్వడం పక్కా!

ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామదేవతలలో ‘పోచమ్మ’ పేరుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలా మహిళలు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. ఇక థ్రిల్లర్ లవర్స్కి అయితే పండగే అని చెప్పొచ్చు. 

యూజర్లకు స్పెషల్ ఆఫర్ 

సాధారణ ప్రేక్షకులకు ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 17న అందుబాటులోకి వస్తుంది. ‘ఆహా గోల్డ్’ (aha Gold) సబ్‌స్క్రైబర్లకు ఒక స్పెషల్ ఛాన్స్ కల్పించారు. వీరు ఇతరులకంటే 24 గంటల ముందే అంటే ఏప్రిల్ 16 నుండే ఈ భయంకరమైన థ్రిల్లర్‌ను చూడొచ్చు.