V6 News

రెజ్లర్ దీపక్ పునియా@1

రెజ్లర్ దీపక్ పునియా@1

ఇండియన్‌‌ స్టార్‌‌ రెజ్లర్‌‌ దీపక్‌‌ పునియా.. యునెటైడ్‌‌ రెజ్లింగ్‌‌ ఫెడరేషన్‌‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్‌‌లో నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌ను సాధించాడు. ఇటీవల ముగిసిన రెజ్లింగ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో స్వర్ణం చేజారినా.. 86 కేజీల విభాగంలో టాప్‌‌ ర్యాంక్‌‌ను కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం 20 ఏళ్ల దీపక్‌‌ ఖాతాలో 82 పాయింట్లు ఉండగా, వరల్డ్‌‌ చాంపియన్‌‌ హసన్‌‌ యజ్దాని (ఇరాన్‌‌) 82 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది యాసర్‌‌ డోగు టోర్నీలో సిల్వర్‌‌, ఆసియా చాంపియన్‌‌షిప్‌‌, సస్సారి టోర్నీల్లో కాంస్య పతకాలు సాధించాడు. ఇక 65 కేజీల విభాగంలో  స్టార్‌‌ రెజ్లర్‌‌ బజ్‌‌రంగ్‌‌ పూనియా (63) రెండో ర్యాంక్‌‌కు పడిపోయాడు. నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌తో వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో అడుగుపెట్టిన బజ్‌‌రంగ్‌‌ కాంస్యానికే పరిమితం కావడంతో ర్యాంక్‌‌ దిగజారింది. స్వర్ణం గెలిచిన గజిమురాడ్‌‌ రషిదోవ్‌‌ (రష్యా) టాప్‌‌ ర్యాంక్‌‌ను దక్కించుకున్నాడు. 57 కిలోల విభాగంలో రవి దహియా ఐదో ర్యాంక్‌‌కు చేరాడు.  వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో రవి కాంస్యం నెగ్గాడు. మహిళల ర్యాంకింగ్స్‌‌లో వినేశ్‌‌ ఫొగట్‌‌ (53 కేజీ) నాలుగు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌‌కు చేరింది. 50 కిలోల విభాగంలో సీమా బిస్లా మూడో స్థానానికి పడిపోగా, పూజా దండా (59 కిలోలు) ఐదో ర్యాంక్‌‌ సాధించింది.