సమతామూర్తిని సందర్శించిన రాజ్ నాథ్ సింగ్

సమతామూర్తిని సందర్శించిన రాజ్ నాథ్ సింగ్

ఆది శంకరచార్యులు సనాతన ధర్మం కోసం కృషి చేశారన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. హైదరాబాద్ ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సమతామూర్తి కేంద్రాన్ని  దర్శించుకున్న రాజ్ నాథ్ సింగ్  మొక్కలు నాటారు. ప్రవచన మందిరంలో ప్రసంగించిన రాజ్ నాథ్ సింగ్ .. 216 అడుగుల ప్రతిమను రామనుజాచార్యుల మరో అవతారంగా భావిస్తున్నానన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. రామనుజాచార్యులు, శంకరాచార్యులు, మద్వ చార్యులు....హిందూ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. అంటరానితనంపై రామనుజాచార్యులు గళమెత్తారన్నారు. లింకన్ వంటి వారు కూడా సమానత్వం కోసం కృషి చేశారన్నారు. సమాజంలో అందరూ సమానమే అని చిన్నజీయర్ స్వామి చాటుతున్నారన్నారు. రామనుజాచార్యులు అసమానత్వపు గోడలు కూల్చారని.. వెనుకబడినవారిని పూజారులుగా చేశారన్నారు రాజ్ నాథ్ సింగ్.  

1000  సంవత్సరాల  క్రింద దేవాలయాల తలుపులు..  అన్నీ కులాల వాళ్ళ కోసం  తెరిచి రామానుజ చార్యులు సమానత్వం చాటారన్నారు ఆధ్యాత్మిక గురువు రవి శంకర్ . నేటి తరం వారికి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలన్నారు. ముచ్చింతల క్షేత్రం భవిష్యత్తులో పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందన్నారు.