న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 పేపర్ లీక్ ఇష్యూపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్ అయ్యిందని ఒప్పుకునేందుకు పార్లమెంటరీ కమిటీ ముందు నిరాకరించిన ఆయన.. సీబీఐ విచారణ తర్వాతే అసలు విషయం తెలుస్తుందన్నారు. కాగా, 2026, మే 3న జరిగిన నీట్ యూజీ పేపర్ లీకైన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్ ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది.
ఈ క్రమంలో ఎన్టీఏ చీఫ్అభిషేక్ సింగ్, చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషిలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. నీట్ పరీక్షలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీ, అవకతవకల ఆరోపణలపై కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని విద్యా, యువజన వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు గురువారం (మే 21) ఎన్టీఏ చీఫ్ అభిషేక్ సింగ్, చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి హాజరయ్యారు. ఈ సందర్భంగా నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు పార్లమెంటరీ కమిటీ ముందు అంగీకరించేందుకు ఏన్టీఏ చీఫ్ అభిషేక్ సింగ్ నిరాకరించినట్లు తెలిసింది.
►ALSO READ | ఇండియాలో నా కోసం చాలా మంది వెయిటింగ్.. ఢిల్లీలో దిగగానే పట్టుకుపోయి జైల్లో ఏస్తరు: కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్
ఈ విషయంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేస్తోందని.. సీబీఐ దర్యాప్తు ముగించి పేపర్ లీక్ అని ధృవీకరించిన తర్వాతే ఎన్టీఏ కూడా దీనిని పేపర్ లీక్‌గా అంగీకరిస్తుందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. గతంలో జరిగిన పేపర్ లీక్‌ల ఆరోపణలకు సంబంధించిన సంఘటనలపై కూడా కమిటీ సభ్యులు ఎన్‌టీఎను ప్రశ్నించారు. అయితే, ఈ విచారణ సందర్భంగా అధికార ఎన్డీఏ కూటమి ఎంపీలు ఎన్టీఏ అధికారులకు మద్దతుగా మాట్లాడినట్లు సమాచారం. కాగా, పేపర్ లీక్ కారణంగా నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ 2026, జూన్ 21న జరగనుంది
