ఇండియాలో నా కోసం చాలా మంది వెయిటింగ్.. ఢిల్లీలో దిగగానే పట్టుకుపోయి జైల్లో ఏస్తరు: కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్

ఇండియాలో నా కోసం చాలా మంది వెయిటింగ్.. ఢిల్లీలో దిగగానే పట్టుకుపోయి జైల్లో ఏస్తరు: కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోన్న క్రాకోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పార్టీ అజెండా, సోషల్ మీడియాలో పెరుగుతున్న ప్రజాదరణ, తన అరెస్ట్ వంటి అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ది రెడ్ మైక్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిజిత్ మాట్లాడుతూ.. నేను ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే ఢిల్లీ పోలీసుల కాన్వాయ్ నన్ను నేరుగా తీహార్ జైలుకు తీసుకెళ్తుందని నాకు అనిపిస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు ఇండియాలో చాలా మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. 

నిరుద్యోగులను దేశంలో బొద్దింకల్లా చూస్తారనే మా గుర్తింపు చివరకు మాకు తెలిసిందన్నారు. ఇక, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్ విషయంలో బీజేపీని బొద్దింక జనతా పార్టీ అధిగమించడం గురించి మాట్లాడుతూ.. మాకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నందుకు సంతోషంగా లేను.. ఎందుకంటే ఫాలోవర్ల సంఖ్యతో సమస్యలు తీరవన్నారు. ఇండియాలో క్రాకోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా బ్యాన్ చేస్తారని తాము ముందే ఊహించమని చెప్పారు. 

ఏంటీ ఈ బొద్దింకల పార్టీ..?

కాక్రోచ్ జనతా పార్టీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు ట్రెండింగ్.. ఎక్కడ చూసిన దీనిపైనే చర్చ, డిబేట్లు. ఒకరకంగా చెప్పాలంటే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ బొద్దింకల పార్టీ. ఇటీవలే దేశంలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్యకు నిరసనగా ఈ డిజిటల్ పొలిటికల్ సెటైరికల్ పార్టీ పుట్టుకొచ్చింది. 

నిరుద్యోగులు, సోషల్ మీడియా బ్యాచీల కోసం "వాయిస్ ఆఫ్ ది లేజీ అండ్ అన్‌ఎంప్లాయిడ్" అనే ట్యాగ్‌లైన్‌తో నెట్టింట హల్ చల్ చేస్తోంది. లీగల్ డిమాండ్ల కారణంగా క్రాకోచ్ జనతా పార్టీ అఫిషియల్ హ్యాండిల్‎ను ఎక్స్ బ్యాన్ చేసిందంటే దీని ప్రభావం ఏ రేంజ్‎లో ఉందో అర్థం చేసుకోవచ్చు.  సోషల్ మీడియాలో ఇంతటి ప్రకంపనలు సృష్టిస్తో్న్న ఈ పార్టీకి జీవం పోసిన వ్యక్తి అభిజిత్ దీప్కే. 

►ALSO READ | బొద్దింక ఈజ్ బ్యాక్: అణు బాంబు వేసినా చావదు అంటూ రెచ్చిపోతున్న నెటిజన్లు

సోషల్ మీడియాతో వేదికగా క్రాకోచ్ జనతా పార్టీ పేరుతో దేశంలోని నిరుద్యోగ యువతను ఏకం చేస్తున్నాడు అభిజిత్ దీప్కే. 30 ఏళ్ల డిజిటల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన అభిజీత్ దీప్కే బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ రిలేషన్స్‌లో పట్టభద్రుడయ్యాడు. అంతకుముందు పూణేలో జర్నలిజంలో తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు.

కాక్రోచ్ పార్టీ డిమాండ్స్

బొద్దింక జనతా పార్టీ గురించి చెప్పాలంటే.. CJP తనను తాను “సోమరిపోతులు, నిరుద్యోగుల గొంతుకగా పరిచయం చేసుకుంది. ఉద్దేశపూర్వకంగానే సూటిగా, రెచ్చగొట్టే విధంగా ఉన్న దాని మేనిఫెస్టోలో ఐదు వాగ్దానాలు ఉన్నాయి..

* ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు ఉండవు
* చట్టబద్ధమైన ఓట్లను తొలగిస్తే UAPA కింద ఎన్నికల అధికారులను అరెస్టు చేయడం
* మహిళలకు 50 శాతం రిజర్వేషన్
* ప్రధాన వ్యాపార సంస్థల యాజమాన్యాలకు చెందిన మీడియా లైసెన్సులను రద్దు చేయడం
* పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడం

ఇవీ.. CJP చేసిన ఐదు వాగ్దానాలు. ఈ పార్టీ ఇంకా నమోదు కానప్పటికీ.. దేశ యువత నుంచి ఈ పార్టీ అతి తక్కువ సమయంలోనే మద్దతు కూడగట్టుకుంది. యువతలోని Gen Zలకు ఈ పార్టీ చేరువవుతున్నట్లు సోషల్ మీడియాలో ఈ పార్టీకి వస్తున్న స్పందన చెప్పకనే చెప్పింది. 

గూగుల్ ఫారం ద్వారా 3 లక్షల 50 వేల మందికి పైగా యువత అధికారికంగా CJP సభ్యత్వం కోసం నమోదు చేసుకోవడం విశేషం. రేపోమాపో.. Gen Zలకు ఇదో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.