V6 News

ఎందుకోయ్ నేనంటే నీకంత కోపం.. ఇండియన్ క్రికెటర్ కు వలేసిన నర్స్

ఎందుకోయ్ నేనంటే నీకంత కోపం.. ఇండియన్  క్రికెటర్ కు వలేసిన నర్స్
2013లో ఐపీఎల్ ను స్పాట్ ఫిక్స్ంగ్ ఓ కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే 2020 ఐపీఎల్ సీజన్–13ను సైతం ఫిక్సింగ్ బూతం వెంటాడినట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి భారత క్రికెట్ జట్టులో కీరోల్ ప్లే చేస్తున్న ఓ క్రికెటర్ ను సౌత్ ఢిల్లీకి చెందిన ఓ ఆస్పత్రి నర్స్ గాలం వేసింది. సార్ మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మీకు పెద్ద ఫ్యాన్ ను. సౌత్ ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నానంటూ సోషల్ మీడియాలో పరిచయం చేసుకుంది. రోజులు గడుస్తున్నాయి. క్రికెటర్ కు, నర్స్ మధ్య చాటింగ్ లు నడుస్తున్నాయి. ఇద్దరూ ఒకరినొకరు చూసింది లేదు. అంతా ఆన్ లైన్ లో హాయ్ అంటే హాయ్.. బాయ్ అంటే బాయ్ వరకు మాత్రమే వెళ్లింది వాళ్లిద్దరి మధ్య చాటింగ్. ఎందుకు ఇదంతా అంటే క్రికెటర్ ను ముగ్గులోకి దించి కుదిరితే మ్యాచ్ ఫిక్సింగ్, లేదంటే బెట్టింగ్ వేయాలని ప్లాన్ వేసింది. ఆ సమయం రానే వచ్చింది. గతేడాది సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ సీజన్‌‌ –13 మధ్యలో ఉండగా టీమిండియా క్రికెటర్ కు నర్స్ మెసేజ్ చేసింది. నేను ఐపీఎల్ సీజన్ –13 లో మీరు ఆడే టీమ్ లో మీపై బెట్ పెట్టాలని అనుకుంటున్నాను. మీరు ఆడే టీమ్ లో 11మంది సభ్యుల వివరాల గురించి చెప్పాలని కోరింది. దీంతో నర్స్ చాటింగ్ ఎందుకు చేస్తుందో అర్ధం చేసుకున్న క్రికెటర్ సీరియస్ ఎమోజీలను సెండ్ చేశాడు. సీరియస్ ఎమోజీలతో కంగుతిన్న నర్స్ .. ఎందుకోయ్ నేనంటే నీకంత కోపం రిప్లయి ఇచ్చింది. అయినా క్రికెటర్ పట్టించుకోలేదు. ఈ విషయం ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కు చెందిన యాంటీ కరప్షన్ యూనిట్ కు చేరడంతో క్రికెటర్ కు, నర్స్ కు మధ్య జరిగిన సంభాషణ గురించి ఆరా తీసింది. చివరకు క్రికెటర్ ను వివరణ కోరగా..తనకు, నర్స్ కు జరిగిన సంభాషణ గురించి చెప్పాడు. దీంతో క్రికెటర్ చెప్పిన సమాధానంపై  సంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ కేసును కొట్టిపారేసింది. అపరచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ క్రికెటర్ ను మందలించింది.