ఖమ్మం, వెలుగు: ఓ ప్రైవేటు టీచర్ క్లాస్ చెబుతూనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మధిరకు చెందిన గారపాటి జయరాజు(45) కొన్నేళ్లుగా ప్రైవేటు టీచర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఇంటర్ కాలేజీ నుంచి ఖమ్మంలోని మరో స్కూలుకు మారే ప్రయత్నంలో ఉన్నారు.
అందులో భాగంగానే శనివారం మమతా రోడ్ లో ఉన్న శ్రీచైతన్య ఒలంపియాడ్ స్కూల్ లో డెమో ఇస్తుండగా జయరాజుకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బోర్డుపై పాఠం చెబుతూనే అక్కడికక్కడే జయరాజు కుప్పకూలిపోయాడు. జయరాజు మృతితో సొంతూరు మధిర పట్టణంలోని రెండో వార్డ్ ఎంప్లాయిస్ కాలనిలో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు.
