DERC కొత్త టారిఫ్ : విద్యుత్ చార్జీలు పెంచరాదని నిర్ణయం

DERC కొత్త టారిఫ్ : విద్యుత్ చార్జీలు పెంచరాదని నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలోని విద్యుత్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్. కరోనా కారణంగా విద్యుత్‌ బిల్లులను పెంచకూడదని ఢిల్లీ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (DERC) నిర్ణయించింది. దీనికి సంబంధించి DERC కొత్త టారిఫ్‌ రేటును ప్రకటించింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని, పారిశ్రామిక, ప్రభుత్వ యూనిట్లు, దేశీయ వినియోగదారుల సౌలభ్యం కోసం సెప్టెంబరులో రోజులో వేర్వేరు సమయాల్లో వేర్వేరు రేట్ల కింద 20 శాతం సర్‌ చార్జ్‌ మినహాయింపు ఇవ్వనున్నట్లు DERC తెలిపింది. దీనికి తోడు ఎలక్టిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఇ-వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లకు తక్కువ ధరకు విద్యుత్తును అందిస్తామని…గతేడాది మాదిరిగానే పుట్టగొడుగుల సాగును ప్రోత్సహించడానికి చౌక విద్యుత్తు కొనసాగుతుందని తెలిపింది.

దేశీయేతర వినియోగదారుల టైమ్‌ ఆఫ్‌ డే (YOD) పై విధించే సర్‌చార్జీని కూడా మాఫీ చేసింది.  ఈ కేటగిరిలోకి వచ్చే వినియోగదారులకు విద్యుత్‌ ఛార్జీలపై 20 శాతం సర్‌ చార్జీ వసూలు చేయరు. రెండు కిలోవాట్ల ఆవెూదం పొందిన లోడ్‌ కలిగిన వినియోగదారులు నెలకు కిలోవాట్‌కు రూ. 20 చెల్లించాలి. మూడు నుంచి ఐదు కిలోవాట్ల మీటర్ల లోడ్‌ కలిగిన వినియోగదారులు కిలోవాట్‌కు రూ.50, 6-15 కిలోవాట్ల మీటర్ల లోడ్‌ కలిగిన వినియోగదారులు కిలోవాట్‌కూ రూ.100 చెల్లించాల్సి వుంటుంది.