- ఇబ్రహీంపట్నం క్యాంపస్ లో ఆపరేషనల్ సిస్టమ్ పై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కౌంటర్ టెర్రర్ ఫోర్స్ ‘అక్టోపస్’ పనితీరు, శిక్షణ కార్యకలాపాలు, ఆపరేషనల్ సిస్టమ్‌ను డీజీపీ సీపీ ఆనంద్ పరిశీలించారు. ఇబ్రహీంపట్నంలోని అక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. క్యాంపస్‌లోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, శిక్షణ విభాగం, ఆపరేషనల్ సౌకర్యాలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల గురించి సమీక్షించారు.
కమాండోలు, అధికారులతో చర్చించా రు. ఉగ్రవాద ఘటనలు ఎదురైతే వాటిని తిప్పికొట్టేందుకు ఎలాంటి శిక్షణ పొందుతున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) బృందాల పనితీరును, ట్రైనింగ్ విభాగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిం చారు. ఆపరేషనల్ టీమ్స్ నిర్వహిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాట విన్యాసాలు, అత్యాధునిక ఆయుధాల వినియోగంలో కమాండోలకు ఇస్తున్న ప్రత్యేక శిక్షణ గురించి డీజీపీకి వివరించారు.
