కొత్త సవాళ్లపై నిఘా పెట్టాలి..సోషల్ మీడియా, యువతలో మార్పులపై దృష్టి సారించాలి: డీజీపీ సీవీ ఆనంద్

కొత్త సవాళ్లపై  నిఘా పెట్టాలి..సోషల్ మీడియా, యువతలో మార్పులపై  దృష్టి సారించాలి: డీజీపీ  సీవీ ఆనంద్

హైదరాబాద్, వెలుగు: నాలుగు దశాబ్దాలుగా తీవ్ర ప్రభావం చూపిన మావోయిజం ప్రస్తుతం ముగింపు దశలో ఉందని, మారిన పరిస్థితులకు అనుగుణంగా నిఘా విభాగాలు కొత్త సవాళ్లపై దృష్టి సారించాలని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల యువతలో వస్తున్న మార్పులు, తలెత్తే శాంతిభద్రతల సమస్యలపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. 

హైదరాబాద్‌‌‌‌ బేగంపేటలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) కార్యాలయాన్ని ఆయన సోమవారం సందర్శించారు. వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో అద్భుతమైన పాత్ర పోషించిన ఎస్‌‌‌‌ఐబీ అధికారులను డీజీపీ అభినందించారు. ఎస్ఐబీ తన పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలని, మారుతున్న సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో తెలంగాణ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టేలా రాష్ట్ర పోలీసు విభాగానికి ఎస్ఐబీ వెన్నుదన్నుగా నిలవాలని దిశానిర్దేశం చేశారు.