2027 నుంచి ఆన్లైన్ మోడ్లో NEET ఎగ్జామ్

2027 నుంచి ఆన్లైన్ మోడ్లో NEET ఎగ్జామ్

ఢిల్లీ: NEET పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. 2027 నుంచి NEET పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 2027 నుంచి NEET ఎగ్జామ్ CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో జరుగుతుందని వెల్లడించారు.

2027 నుంచి పేపర్ బేస్డ్ ఫార్మాట్లో నీట్ ఎగ్జామ్ జరగదని ఆయన స్పష్టం చేశారు. లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ ఎగ్జామ్ను ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తే పేపర్ లీక్కు తావు ఉండదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నీట్ పేపర్ లీక్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

పేపర్ లీక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పరీక్షను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రద్దయిన నీట్ పరీక్ష జూన్ 21న ఆదివారం నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం ఉదయం ప్రకటించింది. అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని.. అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతామని NTA తెలిపింది. NEET పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను జూన్ 14న విడుదల చేస్తామని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.