అల్లు అర్జున్ పుష్ప2 పోస్టర్లో దాగున్న కథేంటి?

అల్లు అర్జున్ పుష్ప2 పోస్టర్లో దాగున్న కథేంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(AlluArjun) నటించిన పుష్ప పార్ట్ 1(Pushpa1) ఇప్పటికే సంచలన విజయం సాధించింది. అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ అవార్డు సైతం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2(Pushpa2 ) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

లేటెస్ట్గా పుష్ప2 రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇస్తూ కొత్త పోస్టర్ను మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక  పుష్ప 2 స్టోరీ విషయానికి వస్తే.. పుష్ప పార్ట్1 ఎండింగ్లో..మొదలైన సస్పెన్స్ను కంటిన్యూ చేస్తూ..పుష్ప కనిపించట్లేదు అంటూ టీజర్తో ఆసక్తి క్రియేట్ చేశారు డైరెక్టర్ సుకుమార్. దీంతో పుష్ప మలేషియా, చైనా, జపాన్ లాంటి కంట్రీస్కి పారిపోయాడా..అనే డౌట్ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే, పుష్ప పార్ట్ 1 స్టార్టింగ్లో జపాన్, చైనా దేశాల ప్రస్తావన వస్తోంది. వీరి పూర్తి ఎర్ర చందనం తరలించేది..చైనా జపాన్ కే. 

ఇక పుష్ప 2 టైటిల్ డిజైన్లో స్టోరీనీ లీక్ చేసినట్టు తెలుస్తోంది. లోగోను అబ్జర్వ్ చేస్తే..గ్రీన్ కలర్ లో  డ్రాగన్ తరహ సింబల్ కనిపిస్తుంది. డ్రాగన్ అంటే చైనా అనే విషయం స్ప్రష్టంగా అర్థం అవుతుంది..ఇక చైనా అయ్యి ఉంటుందని టాక్ నడుస్తుంది.

క్రియేటెవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది(2024) స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.