పుష్ప పెట్టింది పులి గోరా.. అంత స్పెషల్ గా చూపించారంటే అదేనా..

పుష్ప పెట్టింది పులి గోరా.. అంత స్పెషల్ గా చూపించారంటే అదేనా..

పుష్ప.. ది రూల్ వస్తున్న పుష్ప పార్ట్ 2 మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. 2024 ఆగస్ట్ 15వ తేదీ ధియేటర్లలో సందడి చేస్తుంది. ఈ విషయాన్ని చెబుతూ మూవీ యూనిట్ ఓ ఫొటో రిలీజ్ చేసింది. కత్తిలాంటి ఈ పోస్టర్ లో ఒకే ఒక్క బాగా హైలెట్ అయ్యింది. అదే హీరో అల్లు అర్జున్(AlluArjun).. పుష్ప చేతికి పెట్టుకున్న ఉంగరాలు.. చేతి గోళ్లకు ఉన్న రంగులు. ఎడమ చెయ్యి చిటికిన వేలుకు ప్రత్యేకంగా నెయిల్ పాలిష్ వేసింది ఉంది. మిగతా గోళ్లకు రంగు లేదు.. మామూలుగా ఉన్నాయి.. చిటికిన వేలు గోరు పెద్దగా ఉండి.. దానికి నెయిల్ పాలిష్ వేసి ఉంది.. 

ఇక్కడే ఫ్యాన్స్ అందరూ ఇంట్రస్టింగ్ డిస్కషన్ చేస్తున్నారు. అది మామూలు గోరు కాదు.. పులి గోరు అంటున్నారు. పులి గోరు మాత్రమే అంత పెద్దగా.. పొడవుగా ఉంటుందని.. పుష్ప చిటికిన వేలుకు పులిగోరు పెట్టారంటూ హోర్డ్ కోర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి రీజన్ లేకపోలేదు. పుష్ప 2 మూవీ టీజర్ లో.. వేరీజ్ పుష్ప అంటూ వచ్చింది. ఆ టీజర్ ఎండింగ్ లో పుష్ప.. పులితో కనిపిస్తాడు.. పులి నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్ప కనిపించాడనే డైలాగ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ లో పుష్ప చేతి వేళ్లను హైలెట్ చేస్తూ.. ఒక్క చిటికిన వేలుకు మాత్రమే ఎర్ర నెయిల్ పాలిష్ వేసి ఉండటం చూస్తుంటే.. అది కచ్చితంగా పులి గోరు అంటున్నారు ఫ్యాన్స్.

క్రియేటెవ్  డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది(2024) స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.