‘చందమామ’ లాంటి సినిమా మళ్లీ తీయాలనుంది

 ‘చందమామ’ లాంటి సినిమా మళ్లీ తీయాలనుంది

సినిమా అంటే ఆనందింపజేసేదే కాదు, ఆలోచింపజేసేది కూడా అని నమ్మే దర్శకుడు కృష్ణవంశీ. అందుకే ఆయన తీసిన ఇరవై చిత్రాల్లో ఎక్కువ శాతం అవే. త్వరలో రానున్న ‘రంగమార్తాండ’ కూడా అలాంటిదే అంటున్నారాయన. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో రూపొందిన ఈ మూవీ ఆగస్టులో విడుదలవుతున్న సందర్భంగా కృష్ణవంశీ వెలుగుతో ఇలా ముచ్చటించారు.

  •  ఓ అమ్మానాన్నల కథ ఇది. మన తల్లిదండ్రుల్ని మనం ఎలా చూస్తున్నాం, వాళ్లతో మనం ఎలా ఉంటున్నాం అనేది ప్రధానాంశం. డబ్బు, సక్సెస్, సర్వైవల్‌‌‌‌‌‌‌‌ కోసం నలిగిపోతూ జనం చేస్తున్న జీవన పోరాటాన్ని ఓ నటుడి పాయింట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ వ్యూలో చూపించే కథ. చూసిన వాళ్లందరికీ వాళ్ల పేరెంట్స్ గుర్తొస్తారు. 
  • నానా పటేకర్ రిఫర్ చేయడంతో ప్రకాష్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ తనే నటిస్తూ,  డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలనుకున్నాడు. నేను కూడా సినిమా చూసి, సొసైటీకి ఇలాంటి సినిమాలు అవసరం, కచ్చితంగా చేయమని చెప్పా. మొదట స్క్రీన్‌‌‌‌‌‌‌‌ ప్లే విషయంలో హెల్ప్ చేయమని అడిగి, ఆ తర్వాత డైరెక్షన్ బాధ్యత కూడా నాపైనే ఉంచాడు. దీనికి ఆధారమైన మరాఠీ మూవీ ‘నటసామ్రాట్’ చూసినప్పుడు చాలా ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది.  నేనొక సినిమావాణ్ని అయ్యుండి కూడా నాలుగైదు చోట్ల కన్నీళ్లొచ్చాయి. కొద్ది రోజుల పాటు ఆ ఎఫెక్ట్ నాపై అలాగే ఉంది. అలాంటి సినిమాలు, ఇంట్లో జరిగినట్టు అనిపించే కథలు ఇటీవల తెలుగులో తగ్గాయి. అందుకే ఇది కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన కథనిపించింది.
  • రీమేక్ రైట్స్ తీసుకున్నప్పటికీ అందులోని మూలకథను, పాత్రల్ని మాత్రమే తీసుకున్నాను. ప్రస్తుత ట్రెండ్‌‌‌‌‌‌‌‌కి, యాటిట్యూడ్స్‌‌‌‌‌‌‌‌కి తగ్గట్టుగా చాలా మార్పులు చేశాం. ఒకే ఐడియాకి రెండు డిఫరెంట్ వెర్షన్స్‌‌‌‌‌‌‌‌ అన్నట్టు ఉంటుంది. ‘నటసామ్రాట్‌‌‌‌‌‌‌‌’ విషయంలో ప్రతిదీ ప్యూర్ అండ్ సింపుల్‌‌‌‌‌‌‌‌గా ఉంచారు దర్శకుడు మహేష్ మంజ్రేకర్. ఆ సింప్లిసిటీనే  బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. తెలుగుకి కూడా నేను అదే ఫాలో అయ్యాను. 
  • రాఘవయ్య అనే నటుడు రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన రోజు నుంచి ఈ కథ మొదలవుతుంది. ఒక అద్భుతమైన నటుడు, తండ్రి, మామగారు, స్నేహితుడు, భర్త అనే నాలుగైదు డైమెన్షన్స్ ఉన్న పాత్రని ప్రకాష్ రాజ్ అద్భుతంగా పోషించాడు. నేనేంటో తనకి, తనేంటో నాకు బాగా తెలుసు కనుక మా ఇద్దరి మధ్య ఎప్పుడూ డిఫరెన్సెస్‌‌‌‌‌‌‌‌ రావు. అతనికే కాదు ఏ యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కైనా ఒక కంఫర్ట్‌‌‌‌‌‌‌‌ ఇస్తాను. వాళ్లు ఆ పాత్ర కోసం ఆలోచించాల్సిన పని లేదు.. ఫీలయితే చాలు అని డిటెయిల్స్ చెప్తాను. దానికి వాళ్లు కన్విన్స్ అవుతారు కాబట్టే నా సినిమాల్లో పెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మెన్సెస్‌‌‌‌‌‌‌‌ డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. 
  • రమ్యపేరు చెప్పగానే నీలాంబరి, శివగామి లాంటి పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ రోల్స్ గుర్తొస్తాయి. అలాంటి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదిది. ఇందులో ఆమె ఓ సైలెంట్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌. అరుపులు, కోపాలు, కొట్టడాలు లాంటివేమీ లేని ఓల్డ్ జెనరేషన్ హౌస్‌‌‌‌‌‌‌‌ వైఫ్‌‌‌‌‌‌‌‌. ఇంటిని చక్కదిద్దే తల్లి. అలాంటి సైలెంట్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌కి కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించాం. డైలాగ్స్‌‌‌‌‌‌‌‌ కంటే కూడా కళ్లతోనే ఎక్కువ భావాలు పలికించే పాత్ర.  మొదట ఆ పాత్రకి మరికొందరిని అనుకున్నా, రమ్య చేస్తే బాగుంటుంది కదా, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావ్ అన్నాడు ప్రకాష్ రాజ్. తను సెట్‌‌‌‌‌‌‌‌లో ఉంటే నాకు కొంత ఇబ్బంది. నేనేది చెప్పినా నవ్వుతుంది. నేను కూడా నాకు తెలియకుండానే తన గురించి ఆలోచిస్తుంటా. ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌గా ఆ ఇబ్బంది ఎందుకని తనతో చేయడానికి ఇష్టపడను. 
  • ప్రపంచానికి కమెడియన్‌‌‌‌‌‌‌‌గా మాత్రమే బ్రహ్మానందం గారు తెలుసు. కానీ ఆయనెంత గొప్ప ఫిలాసఫర్, మెచ్యూర్డ్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ అనేది నాకు ‘క్షణక్షణం’ టైమ్ నుంచీ తెలుసు. అందుకే చక్రపాణి అనే ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కి ఆయన కరెక్టనిపించింది. ‘మరొకరు ఇదే పాత్రతో వస్తే చేసేవాణ్ని కాదేమో, నీపై నమ్మకంతో చేస్తున్నా’ అన్నారు. ఒరిజినల్ కూడా చూడలేదు. ఇదే తన మొదటి సినిమా అన్నట్టుగా నటించారు.  
  • ఇందులో హీరో, విలన్, గుడ్, బ్యాడ్ అంటూ ఎవరూ ఉండరు. ఎవరి కోణం నుంచి వాళ్లు కరెక్ట్. వాళ్ల మధ్య ఉన్న సిట్యుయేషన్స్ ఒక్కొక్కరిని ఒక్కోలా చూపిస్తాయి. దాని వల్లే క్లాష్. అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా ఇతర ముఖ్య పాత్రల్లో చాలా బాగా నటించారు. ఆకెళ్ల శివప్రసాద్‌‌‌‌‌‌‌‌ అని స్టేజ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ రాసిన రైటర్ దీనికి చాలా మంచి డైలాగ్స్ రాశారు. 
  • ఇళయరాజా గారి మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్‌‌‌‌‌‌‌‌ పిల్లర్. ఐదు పాటలూ అద్భుతంగా ఇచ్చారు. పుట్టుక, మరణం, మధ్యలో జీవితం అనే యూనివర్సల్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ని  నటుడి పాయింట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ వ్యూలో చెప్పే థీమ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ ఉంది. భగవద్గీత సారం అంతా ఆరు చరణాల్లో అద్భుతంగా రాశారు సీతారామశాస్త్రి. తెలుగు జాతికి దేవుడిచ్చిన గొప్ప వరమాయన. అలాంటి వ్యక్తి ఇక లేరని తెలిసినప్పుడు గుండె పిండేసినంత పనయింది. 
  • నాటకం అనేది మన దగ్గర తగ్గింది కానీ నటుణ్ని మాత్రం ఓ డెమీ గాడ్‌‌‌‌‌‌‌‌లా చూస్తున్నాం. అందుకే నటుడి గొప్పతనం చాటేలా చిరంజీవి గారు చెప్పిన షాయరీతో ఈ సినిమా కథ మొదలవుతుంది. ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరం మొదలు చిరంజీవి గారి వరకూ ఉన్న తెలుగు సినిమా నటులందరి ఫొటోస్‌‌‌‌‌‌‌‌పై ఈ షాయరీ వస్తుంది. లక్ష్మీభూపాల అద్భుతంగా రాశాడు.  అది చిరంజీవి గారు చెబితేనే కరెక్టనిపించింది. అనుమానంగానే వెళ్లి అడిగా. చదివి థ్రిల్ ఫీలయ్యారు. నా గురించి నేను చెప్పుకున్నట్టుగా ఉందంటూ అదే రోజు సాయంత్రానికి చెప్పేశారు. 
  • ఫ్లాప్ వస్తే గ్యాప్ రావడం కామన్. ‘నక్షత్రం’ డిజాస్టర్ కావడంతో నాకూ ఏడాది గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ‘రంగమార్తాండ’ మొదలైనా కొవిడ్‌‌‌‌‌‌‌‌తో ఆలస్యమైంది. ప్యాండమిక్‌‌‌‌‌‌‌‌ తగ్గాక కూడా నటీనటులంతా ఇతర సినిమాలతో బిజీ అవడం, అందరి డేట్స్ అడ్జస్ట్ చేయడం లాంటి కారణాలతో ఇంకాస్త లేటయింది. అయినా నా దృష్టిలో సక్సెస్ అంటే ప్రశాంతంగా ఉండటం. నేను నా లైఫ్‌‌‌‌‌‌‌‌ను ఎంజాయ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నానా లేక పదిమంది మెప్పు కోసం బతుకుతున్నానా అనేది చూసుకుంటా. నిజంగా నాకు నచ్చినట్టు ఉంటూ, నేను తీయాలనుకున్న సినిమా తీయగలగడమే నా దృష్టిలో సక్సెస్. రెండు సినిమాలకి కొంత కాంప్రమైజ్ అయ్యాను కానీ ఇప్పటివరకు నేను అనుకున్నదే తీశా. ఆ రకంగా నేను సక్సెస్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నా. నా హ్యాపీనెస్, కంఫర్ట్‌‌‌‌‌‌‌‌, ఫ్రీడమే నా సక్సెస్​.
  • ‘చందమామ’ లాంటి సినిమా మళ్లీ తీయాలనుంది. నెక్స్ట్ మూవీ ‘అన్నం’ చాలా వేడిగా ఉండబోతోంది. స్క్రిప్ట్ పూర్తయింది. వచ్చే నెల నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం.  దేవుడిచ్చిన భూమి, గాలి, నీరు అనే గొప్ప వరాల్ని మనిషి ఎలా నాశనం చేస్తున్నాడనేదే కాన్సెప్ట్. ఫుడ్‌‌‌‌‌‌‌‌ మాఫియా చుట్టూ తిరిగే కథ. వచ్చే  ఏడు ఓ భారీ వెబ్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌కి ప్లాన్ చేస్తున్నా. జాతికి తెలియాల్సిన ఓ కథను అందులో చర్చించబోతున్నా. 
  • ప్రపంచంలోని ఏ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కయినా మరొకరి సినిమా చూస్తున్నప్పుడు ఆ సీన్‌‌‌‌‌‌‌‌ను అలా కాకుండా మరోలా తీస్తే బాగుండేది అనిపించడం సహజం. కానీ కొంత కాలం తర్వాత అది మానేసి, ఆ సీన్‌‌‌‌‌‌‌‌లో ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, ఎందుకలా తీసుంటాడు అనే ఆలోచన వస్తుంది. కొంత అనుభవం తర్వాత ఇప్పుడు నేను ఆ రెండో స్థితిలో ఉన్నాను. అబ్జర్వ్, అనలైజ్ చేస్తున్నాను తప్ప విమర్శించడం, జడ్జ్ చేయడం లాంటివి చేయడం లేదు.
  • రమ్యతో లేడీ ఓరియెంటెడ్‌‌‌‌‌‌‌‌ సినిమా తీస్తారా అని కొందరు అడుగుతున్నారు. కానీ నా దగ్గర ఆన్సర్ లేదు. నిజానికి ఆమె ఆ కెపాసిటీ ఉన్న యాక్ట్రెస్. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో దేన్నీ కోరుకుని వెంటపడటం లేదు. మన జీవితం మన కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో లేదు. ప్రపంచం ఏం చేయిస్తే దాన్ని ఫాలో అవడమే మన పని. అన్నీ ముందే ఫిక్సయ్యాయి. రావాల్సిన టైమ్‌‌‌‌‌‌‌‌కి అది వస్తుంది. జరిగేది జరుగుతుంది. దాన్ని మార్చలేము, ఆపలేము. ఇదేం వేదాంతం కాదు.. ఇదే నిజం. కొంత జీవితం అయ్యాక అందరూ గ్రహించే నిజం. ఇక మా అబ్బాయి రిత్విక్ కృష్ణ ఇప్పుడు టెన్త్ చదువుతున్నాడు. టీనేజ్ కనుక క్రికెట్, మ్యూజిక్, రేసింగ్, బిజినెస్ అంటూ రోజుకొకటి చెబుతుంటాడు. తనేం కావాలనుకుంటే ఆవైపు వెళ్తాడు. మేమేదీ ఫోర్స్ చేయడం లేదు. ఒకవేళ సినిమాల్లోకి వస్తానంటే సపోర్ట్ చేస్తాం. కానీ ఫస్ట్ మూవీ మాత్రం నేను డైరెక్ట్ చేయను. తనకు తానుగా కష్టపడి అవకాశాలు అందుకోవాలి.