గట్టోడే : బత్తాయిలతో విషెస్ చెప్పిన రాఘవేంద్రరావు

గట్టోడే : బత్తాయిలతో విషెస్ చెప్పిన రాఘవేంద్రరావు

టాలీవుడ్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) రూటు సపరేటు. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఎన్టీఆర్,ఎన్నార్ , కృష్ణ, శోభన్ బాబు,చిరంజీవి లాంటి స్టార్ హీరోస్కి వరుస హిట్స్ ఇచ్చిన డైరెక్టర్గా గుర్తింపు పొందారు. 

లేటెస్ట్గా తన సింబాలిక్ మూమెంట్తో..రాఘవేంద్రరావు తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.  చైర్‌పై కూర్చొని..ఆయన ముందు ఉన్న టేబుల్‌పై బత్తై పండ్లు పెట్టి..స్పెషల్ విషెస్ తెలిపే వీడియోను పోస్ట్ చేశారు. ఏదేమైనా తన సింబాలిక్ నేచర్ మరువలేదు..అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  

రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోకి ఎంత ఎలివేషన్స్ ఇస్తాడో..హీరోయిన్లను కూడా తనదైన పంథాలో ఎస్టాబ్లిష్‌ చేస్తాడు. ముఖ్యంగా హీరోయిన్స్పై తీసే రొమాంటిక్ సాంగ్స్లో ఆయనకు ఉన్న యాంగిల్ వేరు. నిజం చెప్పాలంటే ఆయనను మించినవారు ఇండస్ట్రీలో లేరని చెప్పాలి. హీరోయిన్ల నడుము ఒంపులపై..ఇప్పటివరకు ఆయన వాడిన పండ్లు లేవనే చెప్పుకోవాలి..ఒక్క పుచ్చకాయ తప్పితే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన రాఘవేంద్రరావు చలనచిత్ర జీవితంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.