బేబీ వైష్ణవి వరుడు ఎవరో తెలుసా?

బేబీ వైష్ణవి వరుడు ఎవరో తెలుసా?

ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda)..వైష్ణవి చైతన్య( Vyshnavi Chaitanya)..విరాజ్ అశ్విన్(Viraj Ashwin) జంటగా నటించి..యూత్ ను ఫిదా చేసిన మూవీ బేబీ(Baby). టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శక దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకున్నఈ మూవీపై ఇప్పటికీ ఏదో విషయంలో టాక్ నడుస్తుంది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్లో హీరోయిన్ వైష్ణవి చైతన్యను మ్యారేజ్ చేసుకున్నపెళ్లి కొడుకు ఎవరన్నది సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది.

ఇక లేటెస్ట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంకి అతనిని గెస్ట్గా ఆహ్వానించారు. దీంతో బేబీకి వరుడుగా యాక్ట్ చేసింది ఎవరో ఆడియన్స్కి తెలిసిపోయింది. అతను పేరు మల్లిడి కృష్ణ(Mallidi Krishna) అని తెలువగా..అంతే కాకుండా మల్లిడి కృష్ణ బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట  మల్లిడి(Vashishta Mallidi) కి సోదరుడట. దీంతో ఇతని గురుంచి మరింత తెలుసుకోవాలని ఆడియన్స్ అనుకోగా..ఇప్పటికే మల్లిడి కృష్ణ పలు మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడని సమాచారం.

అలాగే 2020లో రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ అందుకున్న..కలర్ ఫోటో మూవీలో హీరో సుహాస్కి సీనియర్గా కనిపించాడు. ఈ మూవీకి బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ కథను అందించి, ప్రొడ్యూస్ చేశాడు. అయినా మల్లిడి కృష్ణ కు మంచి గుర్తింపు రాలేదు. దీంతో బేబీ మూవీలో మల్లిడి కృష్ణ కు చిన్న క్యారెక్టర్ ఇవ్వగా యూత్లో ఫేమస్ అయ్యాడు. అంతలా ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బేబీ మూవీలో హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ఇద్దరినీ కాకుండా.. హీరోయిన్ వైష్ణవి చైతన్య, మల్లిడి కృష్ణ ను మ్యారేజ్ చేసుకోవడమే. అతను కనిపించేది కాసేపు అయినప్పటికీ, మూవీలో వైష్ణవి చైతన్య ఒరిజినల్ క్యారెక్టర్ తెలిస్తే ఏమైపోతాడో అంటూ ఆడియన్స్ సింపతీ చూపించారు.

డైరెక్టర్ వశిష్ఠ మెగా157 గా రానున్న సినిమాను తెరకెక్కించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో రానున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తుంది. మల్లిడి కృష్ణ  డైరెక్టర్ వశిష్ఠ కు సోదరుడు అయినప్పటికీ..సొంతంగా సినిమా కెరీర్ ను నిలదొక్కుకోవడం చూస్తుంటే, ఫ్యూచర్ లో స్టార్ అవుతాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుపుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kri Sh Na (@krishna_mallidi)