మీడియాపై ట్రంప్ అక్కసు

మీడియాపై  ట్రంప్ అక్కసు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా పై విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్ష కార్యాలయమైన వైట్ హైజ్ లో పలు దిగ్గజ మీడియా పత్రికల్ని నిలిపివేయాలంటూ హుకుం జారీ చేశారు. ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు  సైతం ఆ పత్రికలను చదవకూడదని ఆదేశించారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం..జర్నలిస్ట్ లు ప్రజల శత్రువులు అని అభివర్ణించినట్లు ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ట్రంప్ విమర్శించే వాటిని ప్రచురించడాన్ని నకిలీవిగా గుర్తించాలని ట్రంప్ అన్నట్లు తెలిపింది.

20 ఏళ్లుగా వైట్ హౌజ్ కు వచ్చే వాషింగ్ టన్ పోస్ట్ , ది న్యూయార్క్ టైమ్స్ నిలిపివేయాలని ట్రంప్ అన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. వైట్ హౌజ్ లో ఈ న్యూస్ పేపర్లు ఉండేందుకు వీల్లేదని ట్రంప్ అన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్  తెలిపింది.