- విదేశీ టూర్లకు 250 డాలర్లు
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ల రోజువారి భత్యాన్ని (డీఏ)ను బీసీసీఐ భారీగా పెంచనుంది. గతంలో ఉన్న దానిని డబుల్ చేస్తూ ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీవోఏ) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంతకుముందు హోమ్ సిరీస్‌కు ప్రతి రోజు100 డాలర్లు చెల్లించేవాళ్లు. డాలర్ మారకం విలువను బట్టి ఇండియన్ కరెన్సీ ఇచ్చేవారు. అయితే ఈ ఇబ్బందులను తప్పిస్తూ సీవోఏ రూ. 7500 ఫిక్స్ చేసింది. ఇక నుంచి డాలర్ మారకంతో సంబంధం లేకుండా పై మొత్తాన్ని చెల్లిస్తారు. విదేశీ టూర్లకైతే ఇప్పటివరకు 125 డాలర్లు ఇచ్చేవారు. దీనిని డబుల్ చేస్తూ 250 డాలర్లకు పెంచారు. ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్‌కు కూడా ఇది వర్తిస్తుంది. అడ్మినిస్ట్రేటర్స్, ఆఫీస్ బేరర్స్ డీఏను 350 డాలర్లకు పెంచింది. ఈ మొత్తం పెంపు మహిళా క్రికెటర్లకు కూడా వర్తించనుంది.


