హైద‌రాబాద్ లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

హైద‌రాబాద్ లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

హైద‌రాబాద్: జంట న‌గ‌రాల్లోని ప‌లుచోట్ల‌ ఒక్క రోజు మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌నుంద‌ని తెలిపారు అధికారులు. ‌కృష్ణా ఫేస్-2 1400ఎంఎం మెయిన్ రింగ్ -1 పైపులైనుకు జంక్ష‌న్ ప‌నులు చేప‌డుతున్న కార‌ణంగా.. తేది. 02.09.2020 బుధవారం ఉధయం 6 గంటల నుంచి తేది. 03.09.2020 గురువారం ఉదయం 6గంటల వరకు 24 గంటల పాటు ఈ మరమ్మత్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. దీంతో ఈ 24 గంటలు ప‌లు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పిన అధికారులు.. ప్ర‌జ‌లు నీటిని పొదుపుగా వినియోగించుకోవాల‌న్నారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు

మెహదీపట్నం, కార్వాన్, లాంగర్ హౌస్, కాకతీయ నగర్, హుమాయన్ నగర్, తల్లాగడ్డ, ఆసిఫ్ నగర్, ఎంఇఎస్, షేక్‌పేట్, ఓయు కాలనీ, టోలిచౌకి, మల్లెపల్లి, విజయ్ నగర్ కాలనీ, భోజగుట్ట, జియాగూడ, రెడ్ హిల్స్, సచివాలయం, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, అల్లాబండా, గగన్ మహల్, హిమయత్ నగర్, బుద్వెల్, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, సులేమాన్ నగర్, ఎంఎం పహాడి, అత్తాపూర్, చింతల్ ‌మెట్, కిషన్‌బాగ్, మణికొండ, గంధంగూడ, నార్సింగి, కిష్మత్ పూర్ ప్రాంతాలు.