
సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ(Atlee)..బాలీవుడ్ బాద్షా షారుఖ్(Shah Rukh) కాంబోలో తెరకెక్కిన జవాన్(Jawan)మూవీ బాక్సాఫీస్ వసూళ్లను క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.621 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
లేటెస్ట్గా డైరెక్టర్ అట్లీ వైఫ్ కృష్ణ ప్రియా(Priya Atlee) జవాన్ సక్సెస్ని..హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి జవాన్లోని ఛలోనా సాంగ్కు స్టెప్పులేశారు. ప్రసెంట్ ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో క్యూట్గా కనిపిస్తోన్న ప్రియా..కీర్తీ ల డ్యాన్స్కు ఫిదా అయ్యాము అంటూ..నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
లేటెస్ట్గాజవాన్ మూవీకి ఓటీటీ లోను రికార్డ్ క్రియేట్ చేసే ధర పలికినట్లు తెలుస్తోంది. జవాన్ హక్కుల కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీపడినప్పటికీ..చివరికి నెట్‌ఫ్లిక్స్(Netflix) రూ.250 కోట్లతో సొంతం చేసుకున్నట్లు సమాచారం. అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా డ్యూయల్ రోల్ లో కనిపించారు. షారుఖ్‌కు జోడీగా నయనతార, దీపికా పదుకొనే కనిపించగా..విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు.
Kitty @KeerthyOfficial and @priyaatlee dancing #Chaleya song ❤️?@Atlee_dir #Jawan #KeerthySuresh pic.twitter.com/fLcmE4tzDB
— Trends Keerthy (@TrendsKeerthy) September 13, 2023