ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేయాలి : ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి

ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేయాలి : ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి
  •     బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్​ను కోరిన ఈబీసీ జేఏసీ చైర్మన్

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేయాలని ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని శుక్రవారం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావును కోరారు. 

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో ఈబీసీ కమిషన్, ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. దీనిపై రామచంద్ర రావు సానుకూలంగా స్పందిస్తూ అగ్రవర్ణ పేదలను అన్నివిధాలా ఆదుకోవడానికి ప్రధానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.