విద్య.. సమానత్వానికి మార్గం : డాక్టర్ శాంతా సిన్హా

విద్య.. సమానత్వానికి మార్గం : డాక్టర్ శాంతా సిన్హా
  •     జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్​పర్సన్ శాంతా సిన్హా
  •     బీఆర్.అంబేద్కర్​ ఇన్​స్టిట్యూషన్​లో చర్చాగోష్టి

ముషీరాబాద్, వెలుగు: విద్య.. సమానత్వానికి బలమైన మార్గమని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్​పర్సన్ డాక్టర్ శాంతా సిన్హా అన్నారు. బాగ్​లింగంపల్లిలోని బీఆర్.అంబేద్కర్ ఇన్​స్టిట్యూషన్‌‌లో మొదటి తరం విద్యార్థి -విద్య ప్రజాస్వామ్య అంశంపై శనివారం చర్చాగోష్టి నిర్వహించారు. డాక్టర్ శాంతా సిన్హా ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి, ఇన్​స్టిట్యూషన్​ కరస్పాండెంట్ డాక్టర్ జి.సరోజా వివేక్ పాల్గొన్నారు. మొదటి తరం విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు, విద్యాసంస్థల బాధ్యతలపై వారు దిశానిర్దేశం చేశారు. 

కాకా వెంకటస్వామి సామాజిక న్యాయ సాధన కోసం విద్యను ప్రధాన సాధనంగా భావించి ఈ సంస్థలను స్థాపించారన్నారు. వెనుకబడిన వర్గాల వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో విద్యాసంస్థల కార్యకలాపాలకు కాకా మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు. ఇన్​స్టిట్యూషన్​సీఈవో ప్రొ.లింబాద్రి, ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, విద్యార్థులు ఉన్నారు.