ఈసీ వెబ్​సైట్​ హ్యాక్​ చేసిన 24 ఏండ్ల యువకుడు

ఈసీ వెబ్​సైట్​ హ్యాక్​ చేసిన 24 ఏండ్ల యువకుడు
  • 10 వేల నకిలీ ఓటర్​ ఐడీ కార్డుల తయారీ
  • యూపీ యువకుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) వెబ్​సైట్​ను ఓ దుండగుడు హ్యాక్​ చేశాడు. అంతేకాదు.. ఏకంగా 10 వేల నకిలీ ఓటర్​ గుర్తింపు కార్డులను తయారు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఉత్తర్​ప్రదేశ్​లోని శహరన్​పూర్​కు చెందిన విపుల్​ సైనీ అనే 24 ఏండ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మధ్యప్రదేశ్​కు చెందిన అర్మాన్​ మాలిక్​ అనే వ్యక్తి తరఫున ఈ పనిచేసినట్టు గుర్తించారు. ఒక్కో ఐడీ కార్డుకు రూ.100 నుంచి రూ.200 దాకా తీసుకునేవాడని తేల్చారు. సైనీ ఖాతాలో రూ.60 లక్షల దాకా ఉన్నట్టు చెప్పారు. వెంటనే ఆ ఖాతాను ఫ్రీజ్​ చేశారు. సైనీ ఇంట్లోని రెండు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రస్తుతం వెబ్​సైట్​ సురక్షితంగా ఉందని ఈసీ అధికారి ఒకరు చెప్పారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటుకు దూరంగా ఉండకూడదన్న ఉద్దేశంతో అసిస్టెంట్​ ఎలక్టోరల్​ రోల్​ ఆఫీసర్స్​ (ఏరో)ను ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే, ఓటర్​ ఐడీ కార్డుల ప్రింటింగ్​ కోసం ఏరో ఆఫీసుకు చెందిన ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్​ తన ఐడీ, పాస్​వర్డ్​ వివరాలను ప్రైవేట్​ సర్వీస్​ ప్రొవైడర్​కు ఇచ్చాడని చెప్పారు. ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్​తో పాటు సర్వీస్​ ప్రొవైడర్​ను అరెస్టు చేసినట్లు తెలిపారు.