‘ఏనుగమ్మా ఏనుగు.. మా ఊరొచ్చిందేనుగు..’ అని మన ఊరికి వచ్చిన గజరాజు గురించి పాడుకోవడం బాగానే ఉంటది గానీ, దాని ఊరికి వెళ్లినప్పుడు మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే ఈ కారులా అయిపోతది పరిస్థితి. ఏనుగు రోడ్డు దాటుతుండగా ఓ కారు రయ్యున దూసుకుపోయింది. ఆ ఏనుగును చూసి డ్రైవర్ వెంటనే బ్రేకేశాడు. అంతే, ‘నా దారికే అడ్డొస్తవా’ అంటూ కోపంగా కారుపైకి ఎక్కేసింది గజరాజు. కారును తొక్కేసి దాదాపు నుజ్జు చేసినంత పనిచేసింది. అదృష్టం బాగుండి డ్రైవర్ తప్పించుకున్నాడనుకోండి. థాయిలాండ్‌లోని నఖోన్ రచ్చాసిమాలోని ఖావో యై నేషనల్ పార్క్‌లో అక్టోబర్ 29న జరిగిందీ ఘటన.
ప్రత్య చుటిపస్కూల్ అనే ఫొటోగ్రాఫర్ ఈ ఏనుగు బీభత్సాన్ని క్లిక్‌మనిపించాడు.
