మళ్లీ టెస్లా షేర్లు అమ్మిన ఎలన్ మస్క్

మళ్లీ టెస్లా షేర్లు అమ్మిన ఎలన్ మస్క్
  • ప్రాసెస్‌‌ను సింపుల్ చేశామంటున్న డాట్‌‌

ఎలన్‌‌‌‌ మస్క్‌‌‌‌కు చెందిన స్టార్‌‌‌‌‌‌‌‌లింక్ త్వరలో తమ బ్రాడ్‌‌‌‌ బ్యాండ్ సర్వీస్‌‌‌‌లను లాంచ్‌‌‌‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దేశంలో శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను అందించేందుకు రూల్స్‌‌‌‌ను  సులభతరం చేస్తున్నామని డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్‌‌‌‌ టెలికమ్యూనికేషన్ (డాట్‌‌‌‌) పేర్కొంది. దీంతో  స్టార్‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌, భారతీ గ్రూప్‌‌‌‌కు చెందిన వన్‌‌‌‌వెబ్‌‌‌‌ కంపెనీలు ఇండియాలో తమ సర్వీస్‌‌‌‌లను అందించడానికి వీలుంటుంది. ‘శాటిలైట్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లకు క్లియరెన్స్‌‌‌‌ ఇవ్వడానికి ప్రాసెస్‌‌‌‌ను సులభం చేస్తున్నాం. దీంతో  తక్కువ టైమ్‌‌‌‌లోనే వీటి సర్వీస్‌‌‌‌లు అందుబాటులోకి వస్తాయి’ అని డాట్‌‌‌‌ డిప్యూటి డైరెక్టర్ జనరల్‌‌‌‌ ఎస్‌‌‌‌ నిరానియన్‌‌‌‌ అన్నారు. శాట్‌‌‌‌కమ్‌‌‌‌ ఇండస్ట్రీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈవెంట్‌‌‌‌లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాజాగా కమ్యూనికేషన్స్‌‌‌‌ మినిస్ట్రీ సహాయ మంత్రి దేవుసిన్హ్‌‌‌‌ చౌహాన్‌‌‌‌  స్టార్‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌కు సంబంధించి పార్లమెంట్‌‌‌‌లో మాట్లాడారు.  ఎక్స్‌‌‌‌పెరిమెంట్‌‌‌‌/ట్రయల్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ కోసం డాట్‌‌‌‌ వద్ద స్టార్‌‌‌‌‌‌‌‌లింక్ అప్లికేషన్ పెట్టుకుందని  పేర్కొన్నారు. దేశంలో కమర్షియల్ లాంచ్‌‌‌‌ చేయడానికి అవసరమయ్యే అన్ని లైసెన్స్‌‌‌‌ల కోసం స్టార్‌‌‌‌‌‌‌‌లింక్ రెడీగా ఉందని అన్నారు. లైసెన్స్‌‌‌‌ రాకుండానే శాటిలైట్‌‌‌‌ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్‌‌‌‌ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేయొద్దని కంపెనీని ప్రభుత్వం ఆదేశించింది. ‘వచ్చే ఏడాది జనవరి లోపు కమర్షియల్ లైసెన్స్ వస్తుందని ఆశిస్తున్నాం’ అని స్టార్‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌ ఇండియా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సంజయ్ భార్గవ పేర్కొన్న విషయం తెలిసిందే.

టెస్లా షేర్లు మళ్లీ అమ్మాడు..

ఎలన్ మస్క్ మరో 884 మిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను అమ్మేశారు.  మొత్తం 9,34,091 షేర్లను సేల్ చేశారు.  మొత్తం 2.2 మిలియన్ ఆప్షన్లను ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయలనుకుంటున్న ఆయన, వీటిపై ట్యాక్స్‌‌‌‌ను కంపెనీలో షేర్లను అమ్మడం ద్వారా కట్టాలని నిర్ణయించుకున్నారు. టెస్లాలోని తన వాటాలో 10 శాతాన్ని అమ్మాలా? వద్దా? అని నవంబర్‌‌‌‌‌‌‌‌లో ట్విటర్ పోల్‌‌‌‌ పెట్టిన విషయం తెలిసింది. దీనికి మెజార్టీ ఫాలోవర్లు అమ్మేయాలని సలహాయిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13.6 బిలియన్ డాలర్ల విలువైన 12.9 మిలియన్ షేర్లను మస్క్‌‌‌‌ అమ్మేశారు. మరోవైపు ఆప్షన్లను ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్ చేస్తున్నారు. అంటే అదనంగా షేర్లను పొందుతారని కూడా చెప్పొచ్చు. టెస్లా షేరు ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో టచ్ చేసిన హై లెవెల్ నుంచి 25 % మేర పడింది. మస్క్‌‌ సంపద 240 బిలియన్ డాలర్లకు తగ్గింది.