- రూ.25 లక్షలతో ఉద్యోగి పరారీ
జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్‌లోని ‘హోమ్విజ్ ఇంటీరియర్ డిజైనర్’ సంస్థలో పనిచేసే షేక్ ఉమర్ షరీఫ్ అనే ఉద్యోగి.. తానే ఆ కంపెనీ యజమానినని మార్కెట్లో ప్రచారం చేసుకుని సుమారు రూ.25,09,659 వసూలు చేసి పరారయ్యాడు.
కంపెనీ గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తూ కస్టమర్లను నమ్మించి, ఆ సొమ్మును తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు మళ్లించుకున్నాడు. దీనిపై సంస్థ అసలు యజమాని రిషబ్ అగర్వాల్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
