ఎన్ హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులను.. పర్మినెంట్ చేయాలి

ఎన్ హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులను.. పర్మినెంట్ చేయాలి
  • వైద్యారోగ్య శాఖ కమిషనరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళన 

బషీర్​బాగ్, వెలుగు: నేషనల్ హెల్త్ మిషన్ అండ్ స్కీమ్(ఎన్​హెచ్​ఎం) ​కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలంటూ ఎన్​హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఉద్యోగులు కోఠిలోని వైద్యారోగ్యశాఖ కమిషనరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ, యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్​ఖన్నా మాట్లాడుతూ.. ఎన్​హెచ్ఎం కింద 15 వేల మంది 

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 20 ఏండ్లుగా పనిచేస్తున్నారని.. వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఎన్​హెచ్ఎం స్కీమ్​లో పనిచేస్తున్న డాక్టర్లను ఏ మాదిరిగా రెగ్యులరైజ్ చేశారో అదే విధంగా మిగతా సిబ్బందిని పర్మినెంట్ చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో ఉద్యోగులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.