ఎన్ కౌంటర్లో గాయపడ్డ జవాన్కు సర్జరీ

ఎన్ కౌంటర్లో గాయపడ్డ జవాన్కు సర్జరీ

ఎన్ కౌంటర్ లో గాయపడిన జవాన్ కు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స  కొనసాగుతుంది. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. జవాన్ మధుకు చేతి నుండి  చెస్ట్ లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో అతనికి ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటకు తీయనున్నారు డాక్టర్లు. అరచేతి నుండి కుడి వైపు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. మంగళవారం మధును  డీజీపీ మహేంధర్ రెడ్డి, గ్రేహౌండ్స్ చీఫ్ శ్రీనివాస్ రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్, ఐజీ ప్రభాకర్ రావు పరామర్శించారు. మధు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు.  ఎన్ కౌంటర్  గాయపడిన   కానిస్టేబుల్ మధుకు రక్త స్రావం కాకుండా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరి కొద్ది సేపట్లో సర్జరీ చేసి  బుల్లెట్టు తీయనున్నారు యశోద ఆస్పత్రి వైద్యులు. 

తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ సమీపంలోని కర్రెలగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. మరణించిన మావోయిస్టుల్లో ఏటూరు నాగారం-మహదేవ్ పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో ఒక గ్రేహౌండ్స్ జవాన్ కు తీవ్రగాయాలు కావడంతో అతడిని హెలికాప్టర్ ద్వారా వరంగల్ కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బస్తర్ రేంజి ఐజీ పి.సుందర్ రాజ్ వివరాలు తెలిపారు. సంఘటన స్థలం పరిసరాల్లో ప్రస్తుతం గాలింపు జరుగుతోందని వివరించారు.