నష్టపోయిన సెన్సెక్స్ , నిఫ్టీ

నష్టపోయిన సెన్సెక్స్ , నిఫ్టీ

ముంబై:యూరోపియన్ మార్కెట్లు బలహీనంగా నడవడం, భారీ అమ్మకాల కారణంగా ఈక్విటీ బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌లు సెన్సెక్స్ , నిఫ్టీ మంగళవారం ఒకశాతం శాతం వరకు నష్టపోయాయి.  30 షేర్ల బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్ 632 పాయింట్లు తగ్గి 60,115.48 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 808.93 పాయింట్లు తగ్గి 59,938.38 వద్దకు చేరుకుంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 187.05 పాయింట్లు తగ్గి 17,914.15 వద్ద ముగిసింది. బీఎస్​ఈ-లిస్టెడ్ స్టాక్‌‌‌‌ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 280 లక్షల కోట్లకు తగ్గడంతో  పెట్టుబడిదారులకు రూ. 3 లక్షల కోట్ల నష్టం జరిగింది. ఎఫ్‌‌‌‌ఐఐల విక్రయాల ఒత్తిడి కారణంగా మార్కెట్ సోమవారం నాటి లాభాలను కోల్పోయింది. ఫియర్ గేజ్ ఇండెక్స్ ఇండియా వీఐఎక్స్​ దాదాపు 6శాతం పెరగడంతో ఆటో మినహా అన్ని రంగాల్లో విక్రయాలు కనిపించాయి. ఈ వారం క్యూ3 ఎర్నింగ్స్ సీజన్ ప్రారంభం కావడంతో బ్యాంకులు, ఫైనాన్షియల్‌‌‌‌లు  ఐటీ స్టాక్‌‌‌‌లు అత్యధికంగా నష్టపోయాయి. సెన్సెక్స్ ప్యాక్ నుంచి, భారతీ ఎయిర్‌‌‌‌టెల్,  ఎస్‌‌‌‌బిఐ రెండుశాతానికిపైగా పడిపోయాయి. అయితే, క్యూ3లో గ్లోబల్ హోల్‌‌‌‌సేల్స్​ బాగుండటంతో టాటా మోటార్స్ షేర్​ 6శాతం లాభాలతో ముగిసింది. ట్రేడింగ్ సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉందని, గ్లోబల్​ మార్కెట్లలో పరిస్థితులు బాగా లేకపోవడంతో అమ్మకాలు ఎక్కువ అయ్యాయని కోటక్ సెక్యూరిటీస్‌‌‌‌కు చెందిన శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. పెట్టుబడిదారులు  ఫెడ్ చైర్మన్​ జెరోమ్ పావెల్ కామెంట్స్​ కోసం ఎదురుచూస్తున్నారు.  గురువారం రాబోయే యూఎస్​సీపీఐ రిపోర్ట్​పై ఆసక్తి నెలకొంది. ‘‘ఫెడ్  హాకిష్ వైఖరి నుంచి పావెల్ వైదొలిగే అవకాశం లేదు. అయితే బుధవారం సీపీఐ డేటా ఇన్​ఫ్లేషన్​ తగ్గితే పరిస్థితి మారవచ్చు. మార్కెట్లు పెరగవచ్చు. ఈ ఏడాది ముగింపు నాటికి రేట్లు తగ్గవచ్చు. ధరలు ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగితే మాత్రం మార్కెట్లకు నష్టాలు ఉండవచ్చు”అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన డాక్టర్ వీకే విజయకుమార్ అన్నారు.

నష్టాలకు ఐదు కారణాలు: 

1.ఎఫ్​ఐఐ అవుట్‌‌‌‌ఫ్లో

 ఫారిన్​ పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్​ఐఐలు)ఈ నెలలో ఇప్పటి వరకు  బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఇండియా స్టాక్‌‌‌‌లను విక్రయించారు. వీళ్లు మంగళవారం కూడా భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎఫ్‌‌‌‌ఐఐలు సోమవారం రూ.203 కోట్ల విలువైన మన కంపెనీల ఈక్విటీలను విక్రయించారు. జనవరిలో ఇప్పటివరకు మొత్తం ఫారిన్​ అవుట్​ఫ్లో రూ. 8,548 కోట్ల వరకు ఉంది. చైనా మార్కెట్లను మళ్లీ తెరవడంతో, ఎఫ్‌‌‌‌ఐఐల డబ్బులో కొంత భాగం  అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు వెళ్తుందని స్టాక్​ మార్కెట్​ విశ్లేషకులు అంటున్నారు.

2. ఫెడ్ భయం

యూఎస్​ ఫెడరల్ రిజర్వ్  రేట్ల పెంపు విధానాలు పెట్టుబడిదారులకు టెన్షన్ పెంచుతున్నాయి.  వడ్డీరేట్లను మరోసారి పెంచే అవకాశాలు ఉన్నాయని బ్యాంకు వర్గాలు  సంకేతాలను పంపించడమే ఇందుకు కారణం. శాన్ ఫ్రాన్సిస్కో ఫెడ్ ప్రెసిడెంట్ మేరీ డాలీ మాట్లాడుతూ ఇన్​ఫ్లేషన్​ను తగ్గించడానికి సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 5శాతం కంటే ఎక్కువ పెంచుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అట్లాంటా ఫెడ్ ప్రెసిడెంట్ రాఫెల్ బోస్టిక్ మాట్లాడుతూ, ఫెడ్ రెండవ క్వార్టర్​ప్రారంభంలో 5శాతం కంటే ఎక్కువ రేట్లను పెంచాలని, ఆ తర్వాత చాలా కాలం పాటు నిలిపివేయాలని అన్నారు.

3. ప్రపంచ మార్కెట్లు

టెక్ బూస్ట్‌‌‌‌తో జపాన్‌‌‌‌కు చెందిన నిక్కీ 2 వారాల గరిష్ట స్థాయికి చేరుకోగా,   ఆసియా మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. ఇతర ప్రపంచ మార్కెట్లలో, పాన్- యూరోపియన్ ఎస్​టీ ‘ఓఎక్స్​ఎక్స్ 600’ 0.7శాతం తగ్గింది.  యూకే ‘ఎఫ్టీఎస్​ఈ 100’ 0.3శాతం పడిపోయింది.

4. క్యూ3 రిజల్ట్స్​

టీసీఎస్​సోమవారం మూడో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఇవి అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో షేరు రెండు శాతానికిపైగా నష్టపోయింది. హెచ్​సీఎల్​ టెక్, ఇన్ఫోసిస్, విప్రో.. ఇవన్నీ క్యూ3 ఆదాయాలను ఈవారమే ప్రకటించనున్నాయి. వారాంతంలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్‌‌‌‌ని విడుదల చేస్తోంది.

5. అందరి దృష్టి పావెల్‌‌‌‌పైనే

పెట్టుబడిదారులు  ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ కామెంట్స్​ కోసం ఎదురుచూస్తున్నారు.  గురువారం రాబోయే యూఎస్​సీపీఐ రిపోర్ట్​పై ఆసక్తి నెలకొంది. ‘‘ఫెడ్  హాకిష్ వైఖరిని పావెల్ మార్చుకునే  అవకాశం ఉండకపోవచ్చు. అయితే  సీపీఐ డేటా ఇన్​ఫ్లేషన్​ తగ్గితే  మార్కెట్లు పెరగవచ్చు. ఈ ఏడాది ముగింపు నాటికి రేట్లు తగ్గవచ్చు”అని   విజయకుమార్ అన్నారు.