ఎప్సెట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థల ప్రభంజనం

ఎప్సెట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థల ప్రభంజనం

కాశీబుగ్గ, వెలుగు: ఎప్​సెట్–2026 ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయని ఆ సంస్థల చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. ఆదివారం విడుదలైన ఎప్​సెట్​ఫలితాల సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ విద్యార్థులకు చక్కటి సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.

ఎప్​సెట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు వి.సహ్యు 14వ ర్యాంక్, కె.జీవన్ కుమార్ 19వ ర్యాంక్, కె.ఆశ్రిత, ఆర్.శ్రావణి, జి.యుగన్ చంద్ర, జె.శ్వేత, జె.గురు మోహన్ చరణ్, ఎన్.అవినాష్ రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారని వివరించారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభింనదించారు. కార్యక్రమంలో ఎస్సార్ విద్యాసంస్థల డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.