కరోనా వ్యాక్సిన్ల తయారీకి అంతా రెడీ

కరోనా వ్యాక్సిన్ల తయారీకి అంతా రెడీ

ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లను సప్లయి చేసేందుకు లాజిస్టిక్స్ లీడర్లు సిద్ధమవుతున్నారు. స్నోమ్యాన్‌‌ లాజిస్టిక్స్, బ్లూడార్ట్ ఎక్స్‌‌ప్రెస్, ఆల్‌‌కార్గో లాజిస్టిక్స్, డీహెచ్‌‌ఎల్ ఎక్స్‌‌ప్రెస్, మహీంద్రా లాజిస్టిక్స్ వంటి కంపెనీలు కరోనా వ్యాక్సిన్లు తయారు చేసిన ఫార్మా కంపెనీలతో, ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. లాజిస్టిక్స్, ట్రాన్స్‌‌పోర్ట్ ప్లాన్‌‌ను సిద్ధం చేస్తున్నాయని సంబంధిత వ్యక్తులు చెప్పారు. కోల్డ్ చెయిన్ లాజిస్టిక్స్ ప్రొవైడర్ స్నోమ్యాన్ లాజిస్టిక్స్ తనకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో 10 వేలకు పైగా పాలెట్స్‌‌ స్పేస్‌‌ను కరోనా వ్యాక్సిన్ల కోసం కేటాయించింది. ఈ పాలెట్స్‌‌లో 7 కోట్ల డోస్‌‌లను స్టోర్ చేయొచ్చు. ‘మేము ఇప్పటికే స్వైన్‌‌ఫ్లూ, టైఫాయిడ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్‌‌ను చేపడుతున్నాం. ఈ అనుభవం మాకు కరోనా వ్యాక్సిన్ స్టోరేజ్‌‌కు, డిస్ట్రిబ్యూషన్‌‌కు సాయపడుతుంది’ అని స్నోమ్యాన్ లాజిస్టిక్స్ సీఈవో సునిల్ నాయర్ అన్నారు. స్నోమ్యాన్‌‌కు దేశవ్యాప్తంగా 15 లొకేషన్స్‌‌లో వేర్‌‌‌‌హౌసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 300 రిఫ్రిజిరేటర్ ట్రక్క్‌‌లను, 1,08,375 పాలెట్ల కెపాసిటీని ఇది ఆఫర్ చేస్తుంది.

కోల్డ్ స్టోరేజ్‌‌లు లేని చిన్న పట్టణాలు, తాలుకాలు, గ్రామాల్లో కూడా చిన్న మొత్తాల్లో స్టోరేజ్ ఫెసిలిటీస్‌‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. వ్యాక్సిన్ డెలివరీ కోసం రిఫ్రిజిరేటర్ కంటైనర్స్‌‌ను ఎలా వాడుకోవాలి? ఫ్రీజర్స్‌‌లోకి ఎలా చేరుకోవాలి వంటి వాటిపై ప్రస్తుతం పనిచేస్తున్నట్టు నాయర్ తెలిపారు. దీని కోసం తాము 200 ట్రక్కులను కేటాయించినట్టు చెప్పారు.   స్నోమ్యాన్‌‌తో పాటు ఇతర లాజిస్టిక్స్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ల సరఫరాకు సిద్ధమవుతున్నాయి. బ్లూడార్ట్‌‌ కరోనా వ్యాక్సిన్లను స్టోర్ చేసేందుకు 8 లొకేషన్స్‌‌లో అదనంగా ఏసీ రూమ్‌‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ లొకేషన్స్‌‌లో ముంబై, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణే, కోల్‌‌కతా, ఢిల్లీ, బెంగళూరులు ఉన్నాయని బ్లూడార్ట్ బిజినెస్ డెవలప్‌‌మెంట్ సీఎంఓ, హెడ్ కేతన్ కులకర్ని చెప్పారు. టెంపరేచర్ కంట్రోల్డ్ లాజిస్టిక్స్( టీసీఎస్) సర్వీసెస్ ద్వారా  పలు ఫార్మా కంపెనీలు చేపట్టే క్లినికల్ ట్రయల్స్‌‌లో ఇప్పటికే ఈ కంపెనీ భాగమైంది. కరోనా వ్యాక్సిన్ల సప్లయి కోసం గ్లోబల్‌‌గా 2 లక్షల ప్యాలెట్ల షిప్‌‌మెంట్లు కావాలని బ్లూడార్ట్ పేరెంట్ కంపెనీ  డీహెచ్‌‌ఎల్ చెప్పింది. కూలింగ్ బాక్స్‌‌లలో 1.5 కోట్ల డెలివరీలు చేపట్టవచ్చని తెలిపింది. పలు సప్లయి చెయిన్ సెటప్స్‌‌లో వ్యాక్సిన్లను అందించేందుకు15 వేల ఫ్లయిట్స్ తిరగాల్సి ఉంటుంది.

సవాలుగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ..

మరోవైపు సప్లయి చెయిన్ ఎలా ఉండాలన్నది చివరిగా ఎలాంటి రకం వ్యాక్సిన్‌‌ సక్సెస్‌‌ అవుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందని డీహెచ్‌‌ఎల్ ఎక్స్‌‌ప్రెస్ ఎండీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ సుబ్రమణియన్ చెప్పారు. వ్యాక్సిన్ల సరఫరా కోసం మూడు రకాల ప్లాట్‌‌ఫామ్‌‌లు ఉంటాయని, ఒక రకం –80 డిగ్రీస్‌‌లో స్టోర్ చేయడం, రెండోది –20 డిగ్రీస్ రేంజ్‌‌ది, మూడోది 2 నుంచి 8 డిగ్రీస్‌‌లో స్టోర్ చేసేదని తెలిపారు. లాజిస్టిక్స్ ప్రొవైడర్ పలు రకాల్లో వ్యాక్సిన్ స్టోరేజ్‌‌కు ప్లాన్‌‌ను సిద్ధం చేసుకుంటూ ఉంటారని, డీహెచ్‌‌ఎల్ ఎక్స్‌‌ప్రెస్ కూడా అదే చేస్తుందని చెప్పారు. వ్యాక్సిన్ లాస్ట్ మైల్ ట్రాన్స్‌‌పోర్టేషన్ చేపట్టేందుకు ఫార్మా కంపెనీలు, సప్లయిర్స్, ప్రభుత్వం, సర్వీస్ ప్రొవైడర్స్ వంటి పలువురు స్టేక్‌‌హోల్డర్స్‌‌తో మాట్లాడుతున్నట్టు సుబ్రమణియన్ పేర్కొన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం, తుది డెలివరీ స్టేజస్‌‌లో కూలింగ్ ఫెసిలిటీస్‌‌ అందుబాటులో ఉండకపోవడం, క్లినిక్స్‌‌లో స్టోరేజ్ లేకపోవడం వంటివన్నీ వ్యాక్సిన్ల డెలివరీకి అతిపెద్ద సవాలుగా నిలుస్తాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అభిజిత్ మిత్రా అన్నారు.

చివరి దశకు వచ్చిన కంపెనీల ట్రయల్స్…

ప్యాన్ ఇండియా బేసిస్‌‌లో కరోనా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్, డెలివరీ చేపట్టేందుకు ఇండస్ట్రీ అసోసియేషన్స్, సప్లయి చెయిన్ పార్టనర్లతో కోలాబరేట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని ఆల్‌‌కార్గో లాజిస్టిక్స్ సబ్సిడరీ గతి కౌసర్ చెప్పింది. అలాగే ప్రభుత్వంతో, ఫార్మా కంపెనీలతో మాట్లాడుతున్నట్టు తెలిపింది. గతికి 120 ట్రక్క్‌‌ల ఫ్లీట్ ఉంది. మహీంద్రా లాజిస్టిక్స్ కూడా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్‌‌ కోసం సిద్ధమవుతున్నట్టు చెప్పింది. పలు కంపెనీలతో పార్టనర్‌‌‌‌షిప్‌‌లు కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు చాలా వరకు తుది దశ ట్రయల్స్‌‌లో ఉన్నాయి. సిరమ్ ఇన్‌‌స్టిట్యూట్ తన కరోనా వ్యాక్సిన్‌‌ ఫేస్ 3 క్లినికల్ ట్రయల్స్‌‌ చేస్తోంది. ఫైజర్ ఇంక్, బయోఎన్‌‌టెక్‌‌ డెవలప్ చేసిన వ్యాక్సిన్ 90 శాతం ఎఫెక్టివ్‌‌గా ఉందని ఆ కంపెనీ చెప్పింది. వ్యాక్సిన్ డెలివరీ కోసం ఫైజర్ లాజిస్టిక్స్ ప్లాన్‌‌ను ఇప్పటికే సిద్ధం చేసేసింది.

స్నోమ్యాన్ లాజిస్టిక్స్

10 వేల పాలెట్స్‌‌కు పైగా రిజర్వ్‌‌డ్ స్పేస్

7 కోట్ల వ్యాక్సిన్ డోస్‌‌ల స్టోర్ చిన్న పట్టణాలు, గ్రామాలకు స్పెషల్ ట్రాన్స్‌‌పోర్టేషన్

గతి కౌసర్..

వ్యాక్సిన్ ట్రాన్స్‌‌పోర్టేషన్ ప్లాన్ కోసం ప్రభుత్వం, ఇతర వ్యక్తులతో మాట్లాడుతోన్న కంపెనీ

బ్లూడార్ట్ ఎక్స్‌‌ప్రెస్

వ్యాక్సిన్లను స్టోర్ చేసేందుకు 8 లొకేషన్స్‌‌లో ఏసీ రూమ్‌‌ల నిర్మాణం
ఫెసిలిటీస్‌‌ను కేటాయించడం, వెహికల్స్‌‌ను, ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌లను సిద్ధం చేయడం